సినిమాలో సాహిత్యం కలవాలి

ఈ సందర్భంగా సీనియర్ కథకులు..తమ అనుభవ సారంతో..మాట్లాడుతూ.. వర్థమాన రచయితలు ఎలా రాయాలో, కథలోని లోటుపాట్లను చర్చించి కథా నిర్మాణం వస్తువు ఎలా ఉండాలో వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో సీనియర్ కథకులు అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తంరెడ్డి,జాతశ్రీ, నల్లూరి రుక్మిణి, జీవన్, నలిమెల భాస్కర్, వారాల ఆనంద్‌తోపాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. అనంతరం షార్ట్ ఫిలింస్ ఫెస్టివల్ జరిగింది. హైదరాబాద్ కి చెందిన వి.ఉమామహేశ్వరరావు రూపొందించిన FEEL THE PAIN, A TREES"S LIFE షార్ట్ ఫిలిం పలువురు ప్రసంసలు పొందింది. గతంలోనూ మహేశ్వరారావు గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొని తన షార్ట్ ఫిలింస్ ని ప్రదర్శించారు. దానిని కెనడాకి సంబందించిన సంస్దవారు కొనుగోలు చేసారు.


Click it and Unblock the Notifications











