twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలో సాహిత్యం కలవాలి

    By Staff
    |

    Film
    కరీంనగర్: బుక్‌ కల్చర్‌ను లుక్‌ కల్చర్‌లోకి తీసుకువస్తే సాహిత్యానికి మరింత ఆదరణ లభిస్తుందని, సాహిత్యం సినిమాలో అంతర్భాగం కావాలని పలువురు రచయితలు సూచించారు. కరీంనగర్‌ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి కథా రచయితల వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...సాహిత్యం, సినిమా అనే రెండింటినీ వేరు వేరు భావనతో చూస్తున్నారని మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలని అన్నారు. ఇక ఈ వర్క్‌షాప్‌లో ఖమ్మం, గుంటూరు, మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌, ప్రకాశం, నల్గొండ తదితర ప్రాంతాల రచయిత లు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సీనియర్‌ కథకులు..తమ అనుభవ సారంతో..మాట్లాడుతూ.. వర్థమాన రచయితలు ఎలా రాయాలో, కథలోని లోటుపాట్లను చర్చించి కథా నిర్మాణం వస్తువు ఎలా ఉండాలో వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో సీనియర్‌ కథకులు అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తంరెడ్డి,జాతశ్రీ, నల్లూరి రుక్మిణి, జీవన్‌, నలిమెల భాస్కర్‌, వారాల ఆనంద్‌తోపాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. అనంతరం షార్ట్ ఫిలింస్ ఫెస్టివల్ జరిగింది. హైదరాబాద్ కి చెందిన వి.ఉమామహేశ్వరరావు రూపొందించిన FEEL THE PAIN, A TREES"S LIFE షార్ట్ ఫిలిం పలువురు ప్రసంసలు పొందింది. గతంలోనూ మహేశ్వరారావు గోవా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొని తన షార్ట్ ఫిలింస్ ని ప్రదర్శించారు. దానిని కెనడాకి సంబందించిన సంస్దవారు కొనుగోలు చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X