Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విద్యపై ఆలోచనాత్మక షార్ట్ ఫిల్మ్ ‘ఎంతెంత దూరం’
హైదరాబాద్ : చదువు ఉన్నోళ్ల సొత్తుకాదు. చదువు ఏ ఒక్కరో సొంతం చేసుకున్న ఆస్తి కాదు. చదువు పల్లె పట్టణాల తేడా చూడదు. చదువు దొరల గడీలో బందీకాదు. చదువు అందరిది. పట్టుదల ఉంటే ఆ చదువు ఎంతెంతో దూరంలో లేదు అంటూ చూపించాడు దర్శక నిర్మాత నక్షత్రం వేణుగోపాల్. 'ఎంతెంత దూరం' పేరుతో విద్యపై వేణు తీసిన షార్ట్ ఫిలిం అందరి మన్ననలూ అందుకుంటుంది. ఇప్పటికే ఇఫ్లూ మరియు న్యూ జెర్సీ USA లో ప్రదర్శించ బడి పలువురి ప్రశంశలు అందుకొని, ఇప్పుడు వర్జీనియాలో ప్రదర్శనకు సిద్దమయింది.
చదువు కొందరికి మాత్రమే సొంతమయ్య రోజులు పోయాయి. అందరూ చదువుకుని ప్రయోజకులయ్యే రోజులు వస్తున్నాయి. చదువు విలువ అందరూ తెలుసుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనే అంశంపై 'ఎంతెంత దూరం' పేరుతో లఘు చిత్రం తీశారు ఎన్నారై నక్షత్రం వేణుగోపాల్. నక్షత్ర ప్రొడక్షన్స్ సంస్థ తీసిన ఈ షార్ట్ ఫిలిం మేధావుల దృష్టిని ఆకర్షించడమే కాదు.. అందరినీ ఆలోచింపచేస్తోంది.

ముత్తయ్య పాత్రలో మాభూమి, దాసి వంటి చిత్రాలతో కళాత్మక చిత్రాల నుటుడిగా పేరు తెచ్చుకున్న భూపాల్ రెడ్డి నటించి జీవించారు. ముత్తయ్య భార్య పాత్రలో టీవీ, సినిమా ఆర్టిస్టు మధుమణి, దొర పాత్రలో హరి, ధనుంజయ పాత్రలో అంజిబాబు అద్భుతంగా నటించారు.
షార్ట్ ఫిలిం ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడు వేణు నక్షత్రం ప్రతిభ కనపడుతుంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వేణు తీసిన ఎంతెంత దూరం లఘు చిత్రం ఇటీవల హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో ప్రదర్శించారు. ఈ చిత్రానికి పలువురు ప్రముఖుల ప్రశంసలు లభించాయి. గతంలో వేణు తీసిన 'టేబుల్ ఫర్ త్రీ' లఘు చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ కావడమే కాకుండా, వాషింగ్టన్ మ్యూజిక్ ఫిలిం ఫెస్టివల్ లో ఎనిమిది అవార్డులు అభించాయి. ఈ చిత్రాన్ని కూడా పలు అవార్డుల కోసం పంపించనున్నట్లు వేణు తెలిపారు.