»   » బాహుబలి : ఇంటర్నేషనల్ వెర్షన్ కోసం ఈ మార్పులు

బాహుబలి : ఇంటర్నేషనల్ వెర్షన్ కోసం ఈ మార్పులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తన తాజా చిత్రం బాహుబలి ని ప్రపంచ వ్యాప్తంగా భారిగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం...ఈ చిత్రం లెంగ్త్ కు రీకట్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ ...ఇంటర్నేషనల్ ఎంటర్నైమెంట్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే...ఈ చిత్రం రెండు పార్ట్ లు కలిసి... 290 నిముషాలు వస్తుందని, పాటలు, కొన్ని సీన్స్ తీసేసి వెస్ట్రన్ ఆడియన్స్ కోసం వెర్షన్ ని రెడి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే...రన్ టైమ్ ని...రెండు పార్ట్ ల కథనం చెడకుండా,డ్రామా మిస్సవకుండా ఎడిట్ చేస్తామన్నట్లు తెలిపారు. అలాగే తమ చిత్రం కథ పూర్తిగా తమ ఒరిజనల్ అని, ఇండియన్ ఎపిక్ ఆధారంగా రెడీ చేయలేదని అన్నారు.


‘బాహుబలి'. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తోంది. ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. ఆయన బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ రిలీజ్ గురించి మాట్లాడడం కోసం అక్కడికి వెళ్ళారు.


శోభు యార్ల గడ్డ మాట్లాడుతూ ‘ బాహుబలి ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నాను. ఇప్పటి వరకూ అంటా పాజిటివ్ గానే ఉంది. ఫిల్మ్ మేకర్స్ తో కలిసి ఓ ప్రోడక్ట్ కి వరల్డ్ వైడ్ మార్కెట్ తీసుకురావడానికి కేన్స్ బెస్ట్ ప్లేస్. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని' శోభు యార్లగడ్డ తెలియజేశాడు. అంతే కాకుండా అక్కడి బ్రాస్సిరే డు కాసినో కేఫ్ స్టాఫ్ అంటా బాహుబలి టీ షర్ట్స్ తో సందడి చేస్తున్నారని వారి ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. రెండు పార్ట్స్ గా రానున్న బాహుబలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


 Shortened version for Baahubali’s international version

ఈ చిత్రానికి కి సంభందించి ఫస్ట్ లుక్ పోస్టర్ ల రిలీజ్ లతోనే సినిమాకు ఎనలేని క్రేజ్ ని సంతరించుకున్తున్న సంగతి తెలిసిందే. . సినిమాలో పాత్రలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన మరో పోస్టర్ ని విడుదల చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. తరువాత విడుదల చేసే పాత్ర పేరు ట్విట్టర్ లో తెలిపాడు.


తెలుగులో బిజ్జాలదేవ, తమిళంలో పింగళతేవన్ పేరుతొ తదుపరి పాత్ర వుండనుంది. అయితే ఈ పాత్రను ఎవరు పోషించారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆర్కా మీడియా సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. తాజాగా విడుదల చేసిన ప్రభాకర్(కాళకేయ) పోస్టర్ మంచి స్పందనని సంతరించుకున్న సంగతి తెలిసిందే.


‘బాహుబలి' చిత్రం భారీ బడ్జెట్‌తో ఈ వేసవిలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో విడుదలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా ఈ ఆడియో నిమిత్తం కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టాలని నిర్మాతలు ప్రిపేర్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఆడియో హక్కులు కోసం...పెద్ద పెద్ద ఆడియో కంపెనీలు చాలా ఖర్చు పెట్టి సొంతం చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయని సమాచారం. అలాగే ఈ ఆడియోకు తమిళం నుంచి రజనీకాంత్, హిందీ నుంచి అక్షయకుమార్, తెలుగు నుంచి రాజమౌళి ఇప్పటిదాకా చేసిన హీరోలు హాజరు కానున్నారని సమాచారం.


ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోని మే 31 న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అదే రోజు చిత్రం ట్రైలర్ ని సైతం వదులుతారు. ఈ నేఫద్యంలో రాజమౌళి ప్రమోషన్ పనులును వేగవంతం చేసి రోజుకో రెండు రోజులకో పోస్టర్ చొప్పిన వదిలి సినిమాపై క్రేజ్ ని పెంచుతున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతోఅయితే ఈ విషయమై నిర్మాతలు తేదీ ఖరారు చేస్తూ ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.


మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి. ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.


‘బాహుబలి' చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వంద సెకండ్ల నిడివిగల ట్రైలర్‌ను చూపించే విధంగా ఎడిట్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీ వ్యయంతో రూపొందిస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించిన ఐదవ పోస్టర్‌ను దర్శకుడు రాజవౌళి సామాజిక మాధ్యమంలో సోమవారం పోస్ట్ చేశారు.


నటుడు ప్రభాకర్ కాళకేయగా నటించిన సన్నివేశంతో కొత్త పోస్టర్ వచ్చింది. ఇప్పటివరకు నాలుగు పోస్టర్‌లను విడుదల చేసి సంచలనం సృష్టించిన రాజవౌళి బాహుబలి చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రం విడుదల ఆలస్యం అవుతూండటంతో రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజవౌళి వినూత్న ప్రచారానికి తెరదీశారు.

English summary
Speaking to a popular international entertainment magazine, the film’s producer Shobu Yarlagadda said that the film’s runtime will be adjusted balancing the emphasis between the drama in the narrative and the songs. Shobu also said that the film’s story is completely original and it is not based on any Indian epic.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu