»   » మంచు మనోజ్ ‘శౌర్య’ మూవీ సాంగ్ (టీజర్)

మంచు మనోజ్ ‘శౌర్య’ మూవీ సాంగ్ (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్‌ హీరోగా దశరథ్‌ దర్శకత్వంలో శౌర్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన రెజీనా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘ఓ మనసా' సాంగ్ టీజర్ విడుదల చేసారు. ఈ పాటలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


సురక్షా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై ఈ కమర్షియల్‌ ఎంట ర్‌టైనర్‌ను శివకుమార్‌ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాది సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. బ్యానర్‌పై విడుదలైన 'సూర్య వర్సెస్‌ సూర్య' సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాత శివకుమార్‌ మంచు మనోజ్‌ హీరోగా ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.


Shourya movie O Manasa song teaser

నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ ''ఈ ఏడాది సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మించి పెద్ద సక్సెస్‌ను సాధించాం. ప్రస్తుతం రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ హీరోగా సంతోషం, మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించిన దర్శకుడు దశరథ్‌ దర్శకత్వంలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా రూపొందుతోంది అన్నారు. ఇందులో మనోజ్‌ కళ్లజోడు తో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. దశరథ్‌ ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని తయారు చేశారని, ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని మనోజ్‌ తెలియజేశారు.

English summary
Manchu Manoj shourya movie song teaser is now as 'Shoury's First love'.
Please Wait while comments are loading...