నయనతారకు షో కాజ్ నోటీస్ షాక్

By Srikanya

హైదరాబాద్ :నయనతారపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ మండిపడుతోంది. తక్షణమే సమాధానం చెప్పాలంటూ షో కాజ్ నోటీస్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...దక్షిణాదికి చెందిన నాలుగు సినీ రంగాలూ ఒకే తాటిపై నిలిచి 100ఏళ్ళ సినిమా పండుగని అంగరంగ వైభవంగా జరుపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకని భారీ రీతిలో జరుపడానికి నిర్మాతల మండలి దాదాపు 30కోట్లు ఖర్చుపెట్టింది. అయితే ఈ వేడుకలు నయనతారకు షో కాజ్ నోటీస్ తెచ్చి పెట్టాయి. ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటానని ఆమె హామీ ఇచ్చి మరీ ఎగ్గొట్టింది. దాంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఈ నోటీస్ జారీ చేసింది. దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు.

ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో నాలుగైదు చిత్రాలు చేతిలో పెట్టుకొని హల్‌చల్‌ చేస్తోంది. నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'అనామిక'. వయాకమ్‌ 18 మోషన్స్‌ పిక్చర్స్‌, ఎండెమోల్‌ ఇండియా, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నయనతార మాట్లాడుతూ ''స్త్రీ ప్రాధాన్యమున్న సినిమాలో నటించడం చాలా ఆనందాన్నిస్తోంది. అనామికగా కొత్త నయనతారని చూస్తారు. కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా'' అన్నారు.

అలాగే ... ''కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాను. ఇప్పటికీ మూస పాత్రలకే పరిమితమైతే ప్రేక్షకులు ఏమాత్రం హర్షించరు. అందుకే కాస్త్తెనా కొత్తదనం ఉన్న కథలనే ఎంచుకొంటున్నాను''అని చెబుతోంది నయనతార. నటన ప్రదర్శించడానికి ఇప్పుడు చక్కటి అవకాశం లభిస్తోంది. చిత్ర పరిశ్రమలోకి నేను అడుగుపెట్టిన రోజులతో పోలిస్తే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో వాణిజ్య చిత్రాల్లో మాత్రమే అవకాశం దొరికేది. పాటలు, డ్యాన్సులతోనే గడిచిపోయేది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదొక మంచి పరిణామం''అని చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X