మరి ఆ యాడ్స్ ఎందుకు చేసినట్లు? ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై విమర్శలు!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రద్దా కపూర్ తాజాగా ఓ విషయంలో నెటిజన్ల విమ్శలకు గురైంది. ఓవర్ వెయిట్ ఇష్యూలో ఆమె విద్యా బాలన్, పరిణీతి చోప్రాలకు మద్దతుగా నిలవడంతో ఆమెపై నెటిజన్లు రెచ్చిపోయారు.
ఇటీవల విద్యా బాలన్ తన అధిక బరువుపై స్పందిస్తూ.... నా బాడీ నా ఇష్టం. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా. నేను చేస్తున్న పని పట్ల సంతృప్తిగానే ఉన్నా. మీరే మీ మెంటాలిటీ మార్చుకోవాలి. అని విద్యాబాలన్ సమాధానం ఇచ్చింది. గతంలో పరిణీతి చోప్రా మీద కూడా ఇలాంటి విమర్శలే రావడంతో ఆమె బరువు తగ్గారు.

వారికి సపోర్టు చేస్తూ శ్రద్ధా కపూర్ కామెంట్స్
విద్యా బాలన్ మాదిరిగా అధిక బరువు విమర్శలు ఎదుర్కొంటున్న వారికి సపోర్టు చేస్తూ శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశారు. హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో ఫోటో పోస్టు చేసిన శ్రద్ధా ఆమెకు కూడా పర్‌ఫెక్ట్ ఫిగర్ లేదు, కానీ ఆమె ప్రపంచం మొత్తం మీద అందమైన మహిళగా పేరు తెచ్చుకుంది. అధిక బరువుకు, అందానికి సంబంధం లేదు అంటూ శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు చేశారు.

మరి ఆ యాడ్స్ ఎందుకు చేశావంటూ శ్రద్దా కపూర్ మీద విమర్శలు
దీంతో శ్రద్ధా కపూర్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు. అధిక బరువుకు సపోర్టు చేస్తున్న నువ్వు ఫ్యాట్ తగ్గించుకోవాలి అంటూ గ్రీన్ టీ యాడ్స్ ఎందుకు చేసినట్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు కొందరు నెటిజన్లు.

చేసేది ఒకటి, చెప్పేది
శ్రద్ధా కపూర్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.... ఏ మనిషికైనా రెండు నాలుకల ధోరణి ఉండకూడదు అంటూ శ్రద్ధా కపూర్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలపై శ్రద్ధా కపూర్ ఇంకా స్పందించలేదు.

సాహో హీరోయిన్
శ్రద్ధా కపూర్ త్వరలో ‘సాహో' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











