Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Shraddha Das: ఈ పాత్ర నాకెంతో ప్రత్యేకం.. అర్థం టీజర్ లాంచ్‌లో శ్రద్ధా దాస్
బ్యూటిఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఆమె తాజాగా నటించిన చిత్రం అర్థం. ఇందులో మాయ అనే సైకియాట్రిస్ట్ పాత్రలో శ్రద్ధా దాస్ అలరించనుంది. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రాధిక శ్రీనివాస్ నిర్మించారు. 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్తోపాటు అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహించారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారు. అలాగే మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
అందాల భామ శ్రద్ధా దాస్, బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ కలిసి నటించిన చిత్రం అర్థం. సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా దాస్‌తో పాటు చిత్రబృందం తమ అనుభవాలను తెలిపింది.
''ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఇలాంటి హార్రర్ చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్ చాలా ముఖ్యం. డి.ఓ.పి. పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. డైరెక్టర్ మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో గ్లామర్ రోల్లో సైకరియటిస్ట్గా నటించాను. ఈ మూవీలోని నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి బృందంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది'' అని శ్రద్ధా దాస్ తెలిపింది. కాగా ''అందరూ కలల్ని నిజం చేసుకోవాలనుకుంటారు. కానీ నా నిజం కల అయితే బాగుండు అనుకుంటాను'' అంటూ శ్రద్ధా దాస్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. ''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ వేదికపై ఉండడానికి మా నాన్నే స్ఫూర్థి. 'అర్థం' అంటే ఏంటనుకున్నారు? కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి, ప్రతి ఒక్క రిలేషన్ గురించి చూపించాం.
నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు ఈ సినిమా నిర్మించారు. డి.ఓ.పి. పవన్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. అర్జున్ రెడ్డికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం రాధికా శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని పేర్కొన్నాడు.
''కొంతమంది నిర్మాతలు మంచి కాన్సెప్ట్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అయి ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తాయి. అలాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీనివాస్ గారని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి'' అని నటుడు మహేంద్రన్ తెలిపాడు.