For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shraddha Das: ఈ పాత్ర నాకెంతో ప్రత్యేకం.. అర్థం టీజర్​ లాంచ్​లో శ్రద్ధా దాస్​

  |

  బ్యూటిఫుల్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఆమె తాజాగా నటించిన చిత్రం అర్థం. ఇందులో మాయ అనే సైకియాట్రిస్ట్​ పాత్రలో శ్రద్ధా దాస్ అలరించనుంది. మినర్వా పిక్చర్స్​ బ్యానర్​పై ఈ సినిమాను రాధిక శ్రీనివాస్ నిర్మించారు. 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్​తోపాటు అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహించారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌ కథగా తెరకెక్కిన ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారు. అలాగే మలయాళం, కన్నడ భాషల్లో డబ్​ చేసి విడుదల చేయనున్నారు.

  అందాల భామ శ్రద్ధా దాస్​, బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్​ కలిసి నటించిన చిత్రం అర్థం. సెప్టెంబర్​ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్​ను హైదరాబాద్​లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్​ శ్రద్ధా దాస్​తో పాటు చిత్రబృందం తమ అనుభవాలను తెలిపింది.

  ''ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఇలాంటి హార్రర్ చిత్రాలకు వి.ఎఫ్​.ఎక్స్​ చాలా ముఖ్యం. డి.ఓ.పి. పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. డైరెక్టర్​ మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు.

  ఈ చిత్రంలో గ్లామర్​ రోల్​లో సైకరియటిస్ట్​గా నటించాను. ఈ మూవీలోని నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి బృందంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది'' అని శ్రద్ధా దాస్​ తెలిపింది. కాగా ''అందరూ కలల్ని నిజం చేసుకోవాలనుకుంటారు. కానీ నా నిజం కల అయితే బాగుండు అనుకుంటాను'' అంటూ శ్రద్ధా దాస్​ చెప్పే డైలాగ్​తో ప్రారంభమైన టీజర్​ ఆకట్టుకునేలా ఉంది.

  చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. ''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ వేదికపై ఉండడానికి మా నాన్నే స్ఫూర్థి. 'అర్థం' అంటే ఏంటనుకున్నారు? కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి, ప్రతి ఒక్క రిలేషన్ గురించి చూపించాం.

  Shraddha Das About Her Role In Arrtham At Movie Teaser Launch

  నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు ఈ సినిమా నిర్మించారు. డి.ఓ.పి. పవన్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. అర్జున్ రెడ్డికి బ్యాక్​గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం రాధికా శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని పేర్కొన్నాడు.

  ''కొంతమంది నిర్మాతలు మంచి కాన్సెప్ట్ సినిమాలు సెలెక్ట్ చేసుకొని తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అయి ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తాయి. అలాంటి మంచి కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీనివాస్ గారని నమ్ముతున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి'' అని నటుడు మహేంద్రన్​ తెలిపాడు.

  English summary
  Heroine Shraddha Das Speech About Psychiatric Role In Arrtham At Movie Teaser Launch Programme And Says The Role Is Very Special To Her
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X