శ్రద్దకి అశ్రద్ద ఎక్కువైపోయే బ్రాండ్ పోగొట్టుకొంటోంది....
సినిమా పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఛాయిస్ ఉండదని శ్రద్దాదాస్ అనుభవ పూర్వకంగా చెపుతోంది. ఏ పాత్ర ఇచ్చినా సరే కాదనకుండా, శ్రద్దగా తన పని తాను చేసే శ్రద్దాదాస్ కి తెలుగు చిత్ర పరిశ్రమ వరకు సైడ్ హీరోయిన్ గా బ్రాండ్ పడిపోయింది. హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాల్లో నటంచినా కానీ శ్రద్ద ఇంతవరకు చేసినవీ, చేస్తున్నవీ సపోర్టింగ్ క్యారెక్టర్సే. తెలుగు వాళ్లు తనని ఇలా ఓ సైడ్ కి పెట్టేశారని వేరే భాషల్లో ప్రయత్నాలు చేస్తున్న శ్రధ్దాదాస్ కి అక్కడా అలాంటి పాత్రలే దక్కుతున్నాయి.
కన్నడలో ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించిన శ్రద్దాదాస్ అందులో మూడో హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిత, రాధికా గాంధీ తర్వాత థర్డ్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ శ్రద్దకి ఇచ్చారని తెలిసింది. ఏ గడ్డపై అడుగు పెట్టినా తన విషయంలో చిత్ర పరిశ్రమ అదే అశ్రద్ద చూపుతోందని, తన టాలెంట్ కి తగిన గుర్తింపు రావడంల లేదని శ్రద్ద ఫీలౌతోంది, అలా అని వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకోకుండా చేసుకుపోతోంది. బాలీవుడ్ లో చేసిన 'లాహోర్" ఆశించిన ఫలితమివ్వకపోవడంతో ప్రస్తుతానికి దక్షిణాదిలోనే కుస్తీలో పడుతోంది.


Click it and Unblock the Notifications











