For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా.. ఆ ఇద్ధరు హీరోలు ఇష్టం.. శ్రద్ధాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  సినీ పరిశ్రమలో సత్తా ఉన్న యాక్టర్లలో శ్రద్ధా దాస్ ఒకరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించారు. పదేళ్ల కెరీర్‌లో పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

  ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్మీబీట్ తెలుగు శ్రద్దాదాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటిస్తు 'బిగ్ బాస్ తెలుగు వెర్షన్ లో అవకాశం వచ్చింది. కానీ.. నేనే ఒప్పుకోలేదు' అని తెలిపింది. . ఆ వివరాలు....

  టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు?

  టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు?

  బాప్ రే. చెప్పాలంటే కష్టమే. చాలా కష్టమైన ప్రశ్న వేశారు. అయినా టాలీవుడ్ లో నాకు ఇష్టమైన నటుడు అల్లు అర్జున్. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ పై నా ఫొటో వేయించారు. ఆర్య 2 లో మంచి పాత్ర ఇచ్చాడు. ఆర్య 2 తోనే నాకు మంచి పేరు వచ్చింది.

  టాలీవుడ్ లో ఏ హీరోతో అయినా నటించాలని కోరుకుంటున్నారా?

  టాలీవుడ్ లో ఏ హీరోతో అయినా నటించాలని కోరుకుంటున్నారా?

  జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా. తారక్ యాంకరింగ్ బాగుంది. ఇంతకుముందు సినిమాల్లో ఆయన నటన మాత్రమే చూశాను. యాంకరింగ్ చూశాక ఆయన ప్రతిభ ఇంకా తెలిసింది. హోస్ట్ గా చాలా నాచురల్ గా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ చూసిన తర్వాత ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక బలంగా ఉంది.

  Prabhas' Saaho Heroine Finally Confirmed
  బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఎలా ఉంది?

  బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఎలా ఉంది?

  చాలా బాగుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న చాలా మందితో నాకు పరిచయం ఉంది. వాళ్లు ఎలా చేస్తారో అనే ఒక ఆసక్తి నెలకొనడంతో మొదటి వారం బిగ్ బాస్ తెలుగు వెర్షన్ చూశాను. చాలా బాగా చేస్తున్నారు.

  బిగ్ బాస్ లో అవకాశం వస్తే చేస్తారా?

  బిగ్ బాస్ లో అవకాశం వస్తే చేస్తారా?

  నాకు బిగ్ బాస్ తెలుగు వెర్షన్ లో అవకాశం వచ్చింది. కానీ.. నేనే ఒప్పుకోలేదు. ఎందుకంటే నా చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 3 నెలలు బిగ్ బాస్ కు కేటాయించడం కుదరలేదు. అందుకే వదులుకున్నా. సాధారణంగా నేను నెలల తరబడి అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్లను. మా ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. వారం కంటే ఎక్కువగా అవుట్ డోర్ షూటింగులకు వెళ్లను.

  మీ ప్రాధాన్యం.. పాత్రకా? పారితోషికానికా?

  మీ ప్రాధాన్యం.. పాత్రకా? పారితోషికానికా?

  నేను రెండింటికీ ప్రాధాన్యం ఇస్తాను. డబ్బు లేకుంటే బతకలేం కదా. నేనేం రాజుల కుటుంబం నుంచి రాలేదు. అందరిలాగానే నాకూ ఇంటి ఖర్చులుంటాయి. మేకప్ మెన్ ఖర్చులు.. వ్యక్తిగత సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. నటించేటప్పుడు రెమ్యునరేషన్ గురించి కచ్చితమైన అభిప్రాయంతో ఉంటాను. అలాగే పాత్ర కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటాను.

  మీ భవిష్యత్ ప్రణాళికలు?

  మీ భవిష్యత్ ప్రణాళికలు?

  పదేళ్ల కెరీర్ ను చూసుకుంటే ఇప్పుడే నా కెరీర్ వేగం పుంజుకుందని అనిపిస్తోంది. మంచి మంచి పాత్రలు చేయాలని, చాలా ఎక్కువ సినిమాలు చేయాలని ఉంది. అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలని అనిపిస్తోంది. డ్యాన్సులు, పాటలకు మాత్రమే పరిమితం కాదలుచుకోలేదు. ఇప్పుడిప్పుడే మంచి స్క్రిప్టులు, పాత్రలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నా.

  పర్సనల్ లైఫ్ లో లవ్ ప్రపోజల్స్ వచ్చాయా?

  పర్సనల్ లైఫ్ లో లవ్ ప్రపోజల్స్ వచ్చాయా?

  నటిగా మారిన తర్వాత వందల కొద్దీ ప్రపోజల్స్ వచ్చాయి. కానీ నేనే వాటిని రిజెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే వారి ప్రతిపాదనల్లో నిజాయితీ లేదు. ముఖ్యంగా నేను సినిమా పరిశ్రమకు సంబంధించిన వారితోనే రిలేషన్ పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇతర రంగాల నుంచి ఎక్కువగా ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ నేను ఒప్పుకోవడం లేదు. సినిమా పరిశ్రమకు చెందిన వారైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నాతో నమ్మకంగా ఉండేవాళ్లంటేనే ఇష్టపడతాను.

  English summary
  Shraddha Das, one of the talented artists in the film industry. She entered into tollywood with Siddu from Sikakulam. After that she acted in love story Arya 2, A. Karunakaran's Darling, Maro Charitra produced by Dil Raju. Sukumar's Arya 2 was her first high profile project. After ten years of career in different film industries, now she is working with Hindi, Bengali movies. The upcoming movie "Babumoshai Bandookbaaz" has become the most controversial movie at the censor board. In this occasion, Filmbeat Telugu has exclusively interviewed Shraddha Das about the projects and her journey in the film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X