twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటివి చూసి ఎంతో విసిగిపోయా.. ఆర్జీవికి శ్రద్దాదాస్ కౌంటర్!

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఎన్నో విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ మరణంపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సుశాంత్ మరణానికి, నెపోటిజానికి సంబంధం ఉందని, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటివారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే ఇందులో కొందరు బంధుప్రీతికి మద్దతిస్తున్నారు. అలాంటి వారిపై శ్రద్దా దాస్ పరోక్షంగా సెటైర్స్ వేసింది.

    నెపోటిజంపై చర్చ..

    నెపోటిజంపై చర్చ..


    సుశాంత్ మరణం తరువాత బంధుప్రీతిపై విపరీతమైన చర్చ జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. నెపోటిజం కారణంగా కొత్త వారు రాలేకపోతున్నారని, బయటి వ్యక్తులు తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారని కొందరు అంటుంటే.. వర్మ లాంటి మేధావులు మాత్రం ఇంకో రాగాన్ని అందుకున్నారు.

    ప్రతీచోటా ఉంటుంది..

    ప్రతీచోటా ఉంటుంది..

    నెపోటిజం అనేది ప్రతీ చోటా ఉంటుందని, అది లేకపోతే సమాజమే ఉండదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. అంబానీ సంపాదించి వారి కొడుకులకే ఇస్తాడని, చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కే పట్టం గడతాడని, చిరంజీవి రామ్ చరణ్‌ను హీరోగా చేస్తారని అది సహజమని నెపోటిజాన్ని సమర్థించాడు. అయితే తాజాగా శ్రద్దాదాస్ ఇలాంటి కామెంట్లపై సెటైర్స్ వేసింది.

    వర్మకు కౌంటర్..

    వర్మకు కౌంటర్..

    అయితే శ్రద్దా దాస్ చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించినవో కచ్చితంగా చెప్పలేం కానీ.. అవి వర్మ వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. ఇంతకీ శ్రద్దా దాస్ ఏమని ట్వీట్ చేసిందో ఓ సారి చూద్దాం. ‘నెపోటిజంపై జరుగుతున్న చర్చలను చూసి విసిగిపోయాను.. పైగా ప్రతీ రంగంలోనూ అలానే ఉంటుందని చాలామంది అంటున్నారు. తల్లీదండ్రులు వారి వారసత్వాన్ని కొడుకులకు ఇస్తారని చెబుతున్నారు. అయితే మా పేరెంట్స్ డాక్టర్స్, ఇంజనీర్స్ అయితే.. ఎలాంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్‌గా అవ్వగలనా?'అని ప్రశ్నించింది.

    Recommended Video

    Sonam Kapoor Trolls: Kangana Ranaut ను చూసి బుద్ది తెచ్చుకో, Shraddha Kapoor కు నీకు తేడా అదే !
    ప్రతీ ఒక్కరికీ అవకాశాలు..

    ప్రతీ ఒక్కరికీ అవకాశాలు..

    అయితే ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఛాన్స్ ఇస్తారని, అదే కొత్తవారు మాత్రం ఎన్నో ప్రయాసాలు పడాలని శ్రద్దాదాస్ చెప్పుకొచ్చింది. ఓ పెద్ద సినిమాలో అవకాశం రావాలన్నా, పెద్ద డైరెక్టర్లను అప్రోచ్ కావాలన్నా కొత్తగా వచ్చిన వారికి చాలా కష్టమంటూ నెపోటిజాన్ని వ్యతిరేకిస్తూ శ్రద్దాదాస్ ట్వీట్స్ చేసింది.

    English summary
    shraddha Das indirect satire On RGV And Nepotism. Fed up of seeing the nepotism debates & even more so seeing people say that in every field it is the same,parents pass it on. So if my parents were doctors or engineers,would i straight away become one without studying or clearing an exam?!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X