twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్ద లైట్ కట్టర్ తలపై పడి శ్రద్దాదాస్...

    By Srikanya
    |

    కొద్ది రోజుల క్రితమే కంటికి దెబ్బ తగిల్చుకున్న శ్రద్దాదాస్ రీసెంట్ గా తలపై మరో దెబ్బ తగిలించుకుంది. వైవియస్ చౌదరి రేయ్ సెట్స్ పై ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద లైట్ కట్టర్ యాక్సిడెంటల్ గా ఆమె తలపై పడింది. దెబ్బ తగిలి బ్లీడింగ్ అవటంతో వెంటనే మెడికల్ టీమ్ వచ్చి ఆమెను హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు. వాళ్లు కొద్ది కాలం రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయినా బ్యాంకాక్ లాంటి వేరే దేసంలో ఉంటూ తన మూలంగా షూటింగ్ కుంటుపడటం ఇష్టం లేని ఆమె షూటింగ్ కంటిన్యూ చేస్తానని పాల్గొంటోంది. ఇటీవలే ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో శ్రద్ధా దాస్ గాయపడిన సంగతి తెలిసిందే. కంటికి జరిగిన ప్రమాదంలో 4 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ గాయం నుండి కోలుకుని నిన్న మళ్లీ షూటింగ్లో పాల్గొన్న శ్రద్ధా దాస్ మళ్లీ ప్రమాదానికి గురైంది.

    వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న రేయ్ చిత్రంలో అమెరికన్ పాప్ సింగర్ గా అలరించనుంది.ఇందుకోసం ఆమె కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ,కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది.అలాగే వైవియస్ చౌదరి కూడా ఓ రేంజిలో శ్రద్దాదాస్ అందాలను తెరకెక్కించి,కిక్ ఇవ్వటానికి రెడీ అయ్యిపోయాడని తెలుస్తోంది.ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.ఇక వైవియస్ చౌదరి చిత్రాలన్నిటిలోనూ హీరోయిన్ ని అందంగా చూపెడతారనే సంగతి తెలిసిందే.ఇలియానాని తెలుగు తెరకు పరిచయం చేసి,ఆమె కెరీర్ కి పునాది వేసిన చౌదరి తనకూ బ్రేక్ ఇస్తాడని శ్రద్దాదాస్ ఆశతో ఎదురచూస్తోంది.

    ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    A huge light cutter fell in Shraddha Das’ head accidentally which resulted in a huge lump on her head.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X