ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలో శ్రద్ధాదాస్.. దర్శకుడు ఎవరంటే..
టాలీవుడ్, బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రల్లో రాణించి మెప్పించిన అందాల తార శ్రద్దాదాస్. ఇటీవల గరుడ వేగ చిత్రంలో జర్నలిస్టు పాత్రలో కనిపించి అలరించారు. హిందీ చిత్రాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. అయితే బహుముఖ ప్రతిభ కలిగిన శ్రద్ధాదాస్ రూట్ మార్చారు. వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల షార్ట్ ఫిలింలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చిలుకూరి ఆకాశ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యూర్ సోల్ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిలింలో నటించనున్నట్టు ఆమె తెలిపారు. షార్ట్ ఫిలిం ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. మరో అద్భుతమైన షార్ట్ ఫిలింలో నటించడానికి అవకాశం రావడం గర్వంగా ఉంది అని శ్రద్ధాదాస్ ట్వీట్ చేశారు.
shraddha das pure soul short film chilukuri akash reddy శ్రద్ధాదాస్ ప్యూర్ సోల్ షార్ట్ ఫిలిం చిలుకూరి ఆకాశ్ రెడ్డి


Click it and Unblock the Notifications