twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనతో అనగానే మూడు రోజులు నిద్ర పట్టలేదు.. భయం వేసింది.. శ్రద్దాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

    By Rajababu
    |

    సినీ పరిశ్రమలో సత్తా ఉన్న యాక్టర్లలో శ్రద్ధా దాస్ ఒకరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించారు. పదేళ్ల కెరీర్‌లో పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

    ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పిల్మీబీట్ తెలుగు శ్రద్దాదాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు....

    ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏంటి?

    ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏంటి?

    హిందీలో ‘బాబుమొషాయ్ బందూక్‌బాజ్', తెలుగులో ‘పీఎస్‌వీ గరుడు వేగ 126.18ఎం' బెంగాలీ దర్శకుడితో హిందీ సినిమా చేస్తున్నాను. బాబు మొషాయ్ బందూక్‌బాజ్ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పీఎస్‌వీ గురుడలో రాజశేఖర్‌తో నటిస్తున్నాను. మరో హిందీ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతున్నది.

    బాబుమొషాయ్ బందూక్‌బాజ్ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

    బాబుమొషాయ్ బందూక్‌బాజ్ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

    ఈ చిత్రంలో కష్టాలను ఎదుర్కొంటున్న భోజ్‌పురి హీరోయిన్ పాత్రను పోషిస్తున్నాను. హీరోయిన్ పాత్ర కాబట్టి చాలా గ్లామర్‌గా ఉండే దుస్తులు ధరించాను. ఐ లాషెస్ నుంచి ఇతర మేకప్ వస్తువులను వాడారు. నా పాత్ర చాలా బాగుంటుంది. చాలా గంభీరంగా కనిపిస్తాను. కానీ ఎదురించి మాట్లాడే పాత్ర కాదు. నవాజుద్దీన్ జీవితంలోకి ప్రవేశిస్తాను. ఈ సినిమాలో నేను ఓ వ్యాపారం చేస్తుంటాను. ఆ వ్యాపారం ఏమిటనేది నేను చెప్పను. అదేంటో తెరపైనా చూడాల్సిందే.

    నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటించడం ఎలా ఉంది?

    నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటించడం ఎలా ఉంది?

    బాబుమొషాయ్ బందూక్‌బాజ్ సినిమా ప్రారంభానికి ముందు మూడు రోజులు నిద్ర పట్టలేదు. చాలా భయం వేసింది. వణుకు పుట్టినంత పనైంది. ఆ తర్వాత క్యారెక్టర్‌లోకి వెళ్లిన తర్వాత ఆ భయం పోయింది. షూటింగ్‌లో నవాజుద్దీన్ ఎక్కువగా మాట్లాడడు. చాలా కామ్‌గా ఉంటాడు. సెట్లోకి అడుగుపెడితే నవాజుద్దీన్ కనిపించడు. ఆయనలో పాత్రనే కనిపిస్తుంది. పాత్ర గురించే ఆలోచిస్తాడు. క్యారెక్టర్ గురించి చాలా కష్టపడుతాడు.

    పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?

    పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?

    బాబుమోషాయ్ బందూక్‌బాజ్ చిత్రంలోని పాత్ర కోసం ముందస్తుగా కొంత వర్క్ చేశాను. భోజ్‌పురి హీరోయిన్ల హావభావాలను పరిశీలించాను. వారి భాషను, కొంత మంది హీరోయిన్ల బాడీలాంగ్వేజ్‌ను చూశాను. దాని వల్ల ఆ పాత్ర చేయడం చాలా సులభమైంది. ఈ సినిమాను అంగీకరించడానికి ప్రధాన కారణాలు కథ. నా క్యారెక్టర్. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించే అవకాశం రావడం.

    దర్శకుడు కుషాయ్ నందితో పనిచేయడం గురించి..

    దర్శకుడు కుషాయ్ నందితో పనిచేయడం గురించి..

    ఈ సినిమాకు దర్శకుడు కుషాయ్ నంది. అతను సెన్సిబుల్ డైరెక్టర్. ఇంటెలిజెంట్. ప్రతీ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. అతనితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. పాత్రల కోసం కావాల్సిన దుస్తులను, ఇతర అంశాల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొన్నాడు. ఈ సినిమాలో క్యాస్టూమ్స్‌కు చాలా ప్రధాన్యం ఉంటుంది. చాలా వరకు క్యాస్టూమ్స్ రోడ్డు పక్కన నుంచి కొనుగోలు చేశారు. నా దుస్తులు కేవలం రూ.250 పెట్టి కొన్నారు. రూ.25 పెట్టి కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సహజంగా కనిపించేందుకు మాత్రమే అలాంటి దుస్తులు కొన్నాం. సినిమా చూస్తే వాటి ప్రాధాన్యత ఎంతుంటో తెలుస్తుంది.

    48 శృంగార సీన్లు కట్ చేశారంటా.. నిజమేనా?

    48 శృంగార సీన్లు కట్ చేశారంటా.. నిజమేనా?

    కథాపరంగా పాత్రల మధ్య అత్యంత సన్నిహిత, శృంగారపరమైన సీన్లు అవసరం. అలాంటివి చాలా ఉన్నాయి. ముందే చెప్పినట్టు కథలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. హైప్ కోసం సీన్లను పెట్టలేదు. ఈ సినిమాకు ఆ సీన్లు అవసరం. కానీ సెన్సార్ బోర్డు దాదాపు 48 సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని సినిమా నుంచి తొలగించాలంది. ఈ సినిమాలో అసభ్యకరమైన డైలాగ్స్, బూతులు కూడా ఉంటాయి.

    సీన్లు కట్ చేయడం అన్యాయం

    సీన్లు కట్ చేయడం అన్యాయం

    ఈ సినిమాకు ముందే అడల్ట్ (ఏ) సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా ఈ సినిమాలో ఆ సీన్లను తొలగించడం చాలా అన్యాయం. ఈ సినిమా పిల్లలు చూడొచ్చని సర్టిఫికెట్ ఇవ్వలేదు. మరి ఎందుకు శృంగార భరిత సీన్లను ఎందుకు తొలగించారో అర్థ కాలేదు.

    ఈ సినిమా కమర్షియల్ సినిమానా? అవార్డు చిత్రమా?

    ఈ సినిమా కమర్షియల్ సినిమానా? అవార్డు చిత్రమా?

    నేను ముందే చెప్పాను. ఈ కథలో చాలా ఇంటెన్సిటి ఉంటుంది. ఇది పక్కా కమర్షియల్ సినిమా. విమర్శకులు కూడా ప్రశంసించే సినిమా. భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించారు. ఈ సినిమాలో కమర్షియల్ హంగులు ఉంటాయి. నా పాత్ర గురించి ఇప్పటికే మంచి స్పందన వస్తున్నది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

    బాలీవుడ్ లో బంధుప్రీతి (నెపోటిజం) పై చర్చ జరుగుతోంది. నటులకు ఇది ఏ మేరకు సహకరిస్తుంది?

    బాలీవుడ్ లో బంధుప్రీతి (నెపోటిజం) పై చర్చ జరుగుతోంది. నటులకు ఇది ఏ మేరకు సహకరిస్తుంది?

    నటిగా నేను స్థిరపడాలని నేను ప్రయత్నిస్తున్న తొలినాళ్లలో అనేక సినీ నిర్మాణ సంస్థల ఆడిషన్లకు హాజరయ్యేదాన్ని. ప్రతిరోజూ కనీసం 10, 15 ఆడిషన్లకు వెళ్తుండేదాన్ని. ఆ క్రమంలోనే ఒక ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్వహించిన ఆడిషన్ కు హాజరయ్యాను. వాళ్లు చాలా రకాలుగా నన్ను పరీక్షించారు. నాతో పాటు మరో అమ్మాయి హీరోయిన్ పాత్ర కోసం పోటీ పడింది. ఆ అమ్మాయి కంటే నేను బాగా ఆడిషన్ చేశాను. ఆ సంస్థ నిర్వాహకులు నన్ను సెలెక్ట్ చేసినట్టు అనధికారికంగా చెప్పారు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఫోన్ చేయగా హీరోయిన్ పాత్రకు నన్ను ఎంపిక చేయలేదన్న సమాధానం వచ్చింది. నాతో పాటు పోటీ పడిన అమ్మాయి వాళ్లకు దగ్గరి బంధువు కావడంతో నాకు లభించే అవకాశం చేజారింది.

    బాలీవుడ్‌లోనే ఈ పరిస్థితి ఉందా?

    బాలీవుడ్‌లోనే ఈ పరిస్థితి ఉందా?

    ఇలాంటిది సినిమా పరిశ్రమలో చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అంతా అనుకూలంగా ఉందని అనిపించినా.. ఉన్నట్టుండి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో కనిపిస్తుంటాయి. సాధారణంగా ఓ ఉద్యోగానికి ఇంటర్య్యూకు వెళ్తే సుమారు 15 మంది మధ్య పోటీ ఉంటుంది. కానీ సినిమా పరిశ్రమలో ఒక చిన్న పాత్ర కోసం వందల మంది పోటీ పడుతుంటారు. ప్రతిభ ఉన్నా కొన్ని సార్లు అవకాశాలు లభించవు. తమకు తెలిసిన వాళ్లకే ఆఫర్లు ఇస్తుంటారు. ఇలాటి సంఘనలు చాలానే ఎదుర్కొన్నా. కాకపోతే పాత్రల కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

    English summary
    Shraddha Das, one of the talented artists in the film industry. She entered into tollywood with Siddu from Sikakulam. After that she acted in love story Arya 2, A. Karunakaran's Darling, Maro Charitra produced by Dil Raju. Sukumar's Arya 2 was her first high profile project. After ten years of career in different film industries, now she is working with Hindi, Bengali movies. The upcoming movie "Babumoshai Bandookbaaz" has become the most controversial movie at the censor board. In this occasion, Filmbeat Telugu has exclusively interviewed Shraddha Das about the projects and her journey in the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X