వ్యభిచారిగా కనిపించబోతున్న హీరోయిన్ శ్రద్ధా దాస్
హీరోయిన్ శ్రద్దా దాస్ వేశ్య పాత్రలో కనిపించబోతోంది. ఇలాంటి చాలెంజింగ్ రోల్ చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ ఓ షార్ట్ ఫిల్మ్ లో వేశ్య పాత్ర చేసే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పింది. 'ష్రింగర్‌దాన్' పేరుతో తెరకెక్కబోయే ఈ లఘు చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే దర్శకత్వం వహించబోతున్నారు.
దీని గురించి శ్రద్ధాదాస్ మాట్లాడుతూ...'ష్రింగర్‌దాన్ అనేది 90ల్లో జరిగే ఒక కథ. వేశ్య వృతిలో ఉండే యంగ్ ఏజ్ యువతి షైబా.... మధ్య వయస్కుడైన గుప్తా మధ్య జరిగే ఒక కథ. వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తి బ్రోతల్ హౌస్‌లో ఉండే షైబాకు మధ్య అందమైన రిలేషన్ ఎలా ఏర్పడింది అనే కాన్సెప్టుతో ఈ చిత్రం సాగుతుంది' అని తెలిపారు.

ఇలాంటి చాలెంజింగ్ రోల్ చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నమైన, ఎన్నో ఎమోషన్స్‌తో కూడిన పాత్ర ఇది. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నాను అని శ్రద్దా దాస్ తెలిపారు.
షైబా పాత్ర సష్టించే ముందు దీపక్ పాండే చాలా రీసెర్చ్ చేశారు. వ్యభిచార కూపంలో ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఇలాంటి వృత్తిలోకి దిగాల్సి వస్తుంది అనే కోణంలో ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని శ్రద్ధా దాస్ తెలిపారు.


Click it and Unblock the Notifications











