Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రద్దాదాస్ తో వైవియస్ చౌదరి శృంగార పాట్లు
రీసెంట్ గా గోపీచంద్ మొగుడు చిత్రంలో కనిపించి కవ్వించిన శ్రద్దాదాస్ తాజాగా పాప్ సింగర్ కనిపించనుంది.ఆమె వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతోన్న రేయ్ చిత్రంలో అమెరికన్ పాప్ సింగర్ గా అలరించనుంది.ఇందుకోసం ఆమె కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ,కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది.అలాగే వైవియస్ చౌదరి కూడా ఓ రేంజిలో శ్రద్దాదాస్ అందాలను తెరకెక్కించి,కిక్ ఇవ్వటానికి రెడీ అయ్యిపోయాడని తెలుస్తోంది.ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.ఇక వైవియస్ చౌదరి చిత్రాలన్నిటిలోనూ హీరోయిన్ ని అందంగా చూపెడతారనే సంగతి తెలిసిందే.ఇలియానాని తెలుగు తెరకు పరిచయం చేసి,ఆమె కెరీర్ కి పునాది వేసిన చౌదరి తనకూ బ్రేక్ ఇస్తాడని శ్రద్దాదాస్ ఆశతో ఎదురచూస్తోంది.ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.