»   » వేషాల కోసం పడకగదికి రమ్మన్నారు...నిరాకరించినందుకు అలా చేశారు..శ్రద్దాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

వేషాల కోసం పడకగదికి రమ్మన్నారు...నిరాకరించినందుకు అలా చేశారు..శ్రద్దాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సత్తా ఉన్న యాక్టర్లలో శ్రద్ధా దాస్ ఒకరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించారు. పదేళ్ల కెరీర్‌లో పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్మీబీట్ తెలుగు శ్రద్దాదాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు....

గుంటూరు టాకీస్ తర్వాత ఎక్కువగా కనిపించలేదేంటి?

గుంటూరు టాకీస్ తర్వాత ఎక్కువగా కనిపించలేదేంటి?

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్‌లో నటించిన తర్వాత అలాంటివే చాలా రోల్స్ వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. ఆ తర్వాత బాబు మొషాయ్ బందూక్‌బాజ్ హిందీ సినిమా, బెంగాలీ సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటితో బిజీగా ఉన్న సమయంలో ప్రవీణ్ ‘పీఎస్వీ గరుడవేగ' సినిమా కోసం నన్ను సంప్రదించారు. పాత్ర నచ్చడంతో నేను ఒప్పుకొన్నాను.

పీఎస్వీ గరుడ కోసం ఆడిషన్ నిర్వహించారా?

పీఎస్వీ గరుడ కోసం ఆడిషన్ నిర్వహించారా?

‘పీఎస్వీ గరుడవేగ' సినిమాలో నా పాత్ర జర్నలిస్టు పాత్ర. ప్రవీణ్ సత్తారుతో గుంటూరు టాకీస్ చేసినప్పటికీ.. ఈ సినిమా కోసం నాకు ఆడిషన్ నిర్వహించారు. ఆడిషన్‌లో ఓకే అయిన తర్వాతే నాకు రోల్ ఇచ్చారు. ఈ సినిమాలో నా పాత్ర అచ్చమైన తెలుగులో మాట్లాడాలి. న్యూస్ రిపోర్టర్ మాట్లాడినట్టే మాట్లాడాలి. బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉండాలి. ఒకేసారి పొడవైన డైలాగ్స్ చెప్పాలి అని ప్రవీణ్ చెప్పారు. అందుకోసమే నాకు ఆడిషన్ నిర్వహించారు. నాకు తెలుగు మాట్లాడటం వచ్చు. కానీ అచ్చమైన తెలుగు మాట్లాడటం రాదు. దాని కోసం చాలా కష్టపడ్డాను.

Prabhas' Saaho Heroine Finally Confirmed
జర్నలిస్టు పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?

జర్నలిస్టు పాత్ర కోసం ఎలాంటి కసరత్తు చేశారు?

ఆడిషన్‌లో భాగంగా కొన్ని డైలాగ్స్‌లు చెప్తూ వీడియో షూట్ చేశాను. వీడియోలు చిత్రీకరించే ముందు న్యూస్ రీడర్లు, న్యూస్ రిపోర్టర్ల వీడియోలను చూశాను. అనంతరం డైలాగ్స్ చెబుతూ షూట్ చేసిన వీడియోలను ప్రవీణ్ సత్తారుకు చూపించగా ఓకే అన్నారు. ఆ తర్వాతే నాకు పాత్ర ఇచ్చారు. నా అదృష్టం ఏమిటంటే నేను జర్నలిజం చదువుకొన్నాను. ముఖ్యంగా నేను బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో డిగ్రీ చేశాను. బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో నేను శిక్షణ పొందాను. అవన్నీ నా పాత్ర కోసం ఇప్పుడు ఉపయోగపడ్డాయి.

రాజశేఖర్‌తో నటించడం ఎలా అనిపించింది?

రాజశేఖర్‌తో నటించడం ఎలా అనిపించింది?

టాలీవుడ్ సినీయర్ నటుల్లో రాజశేఖర్ ఒకరు. ఇప్పటికే పోలీసు పాత్రల్లో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడ్డారు. అలాంటి సీనియర్ నటుడితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సెట్లో ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటారు. ఒకసారి కెమెరా ముందుకు వెళితే ఆయన రూపం ఒక్కసారిగా మారిపోతుంది. ఆయనలో ఉండే నటుడే కనిపిస్తాడు.

రాజశేఖర్‌తో కాంబినేషన్ సీన్లు ఉన్నాయా?

రాజశేఖర్‌తో కాంబినేషన్ సీన్లు ఉన్నాయా?

పీఎస్‌వీ గరుడలో ఐపీఎస్ ఆఫీసర్‌గా రాజశేఖర్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. ఆ పాత్రను ప్రవీణ్ సత్తారు చాలా బాగా డిజైన్ చేశారు. నాతో చాలా క్లోజ్‌గా ఉన్నారు. నీకు ఇంత రంగు ఎలా వచ్చింది? అని రాజశేఖర్‌ గారు ఆటపట్టించారు. సెట్లో అందరిని ఎంకరేజ్ చేస్తారు. అందరితో కలిసిపోతారు. ఈ చిత్రం కోసం 8 రోజులు రాజశేఖర్ కలిసి చార్మినార్ వద్ద షూట్ చేశాం. చాలా కాంబినేషన్ సీన్లు ఉంటాయి. సినిమా అవసరం మేరకు పాతబస్తీలోని రియల్ లోకేషన్లలో షూట్ చేశాం.

ప్రవీణ్ సత్తారు గురించి మీ అభిప్రాయం?

ప్రవీణ్ సత్తారు గురించి మీ అభిప్రాయం?

ప్రవీణ్ సత్తారు చాలా స్పీడ్‌గా పనిచేస్తారు. నాలుగు రోజుల్లో చేసే పనిని ఒకరోజే కంప్లీట్ చేస్తారు. అతనికి ఏం కావాలో పక్కాగా తెలుసు. నటీనటుల నుంచి ఎలా నటనను రాబట్టుకోవాలో తెలుసు. పాత్రలను బాగా డిజైన్ చేస్తారు. స్క్రిప్ట్‌లు బ్రిల్లియంట్‌గా ఉంటాయి. అతడిని చూస్తే మంచి ఇన్సిపిరేషన్ కలుగుతుంది. అతనికి మంచి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌ కోర్సు చదువుకొన్నారు.

వివిధ భాషల్లో నటిస్తున్నారు..రావాల్సిన స్టార్‌డమ్ ఎందుకు రాలేదనుకుంటున్నారు?

వివిధ భాషల్లో నటిస్తున్నారు..రావాల్సిన స్టార్‌డమ్ ఎందుకు రాలేదనుకుంటున్నారు?

ఎందుకో నాకు తెలియదు. కొందరికి మొదటి సినిమా నుంచే కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్తుంది. ప్రతీ ఒక్కరికి ఓ టైమ్ ఉంటుంది. ఆ సమయం కోసం వేచిచూస్తున్నా. నా కెరీర్ నాకు సంతృప్తికరంగానే అనిపిస్తున్నది. థ్యాంక్స్ గాడ్.. పదేళ్ల తర్వాత కూడా నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పలు భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. నాకు మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి రోల్స్ వస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో రావాల్సిన పాత్రలు ఇప్పుడు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నీ కెరీర్, నీ గ్లామర్ బాగుందని నా సన్నిహితులు, ఫ్రెండ్స్ చెబుతున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఏది ఏమైనా నాకు దక్షిణాదిలో పాపులారిటీ ఉంది. ఉన్నత స్థాయిలో నవాజుద్దీన్ సిద్ధిఖీకి కెరీర్ ప్రారంభం కావడానికి 12 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఆయన స్టార్ యాక్టర్. దేనికైనా ఓపిక ఉండాలి అనేది నేర్చుకొన్నాను.

బోల్డ్ సీన్లు చేయడం వల్ల కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందా?

బోల్డ్ సీన్లు చేయడం వల్ల కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందా?

బోల్డ్ సీన్లు చేయడం వల్ల కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందని అనుకోవడం తప్పు. ఇన్‌స్టంట్ పాపులారిటీ వస్తుంది. అది కొద్ది మేరకే ఉపయోగపడుతుంది. నీవు మంచి యాక్టర్ అయితే నీకు గుర్తింపు వస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. అంతే తప్ప బోల్డ్ సీన్లు అంతగా కెరీర్‌కు ఉపయోగపడవు. నేను బోల్డ్ సీన్లు చేశాను. ఐటమ్ సాంగ్స్ చేశాను. తెలుగు, కన్నడ, తమిళం, బెంగాళీ, హిందీ రంగాల్లో చాలా సినిమాలు చేశాను. చాలా మంది యాక్టర్లతో పనిచేశానంటే అందుకు కారణంగా నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ మాత్రమే.

మీ కెరీర్‌కు టాలీవుడ్ ఏమేరకు ఉపయోగపడింది?

మీ కెరీర్‌కు టాలీవుడ్ ఏమేరకు ఉపయోగపడింది?

ప్రస్తుతం ముంబైలో నాకు సొంత ఇల్లు, కారు ఉందంటే కారణం టాలీవుడ్ మాత్రమే. నా కెరీర్ ఇలా ఉండటానికి ప్రధానమైన కారణం టాలీవుడ్‌లో నేను చేసిన సినిమాలే. వివిధ భాషల్లో నటించినా నా ప్రాధాన్యం ఎప్పుడూ టాలీవుడ్‌కే ఉంటుంది. నా సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే అందులో 90 శాతం మంది అభిమానులు తెలుగువాళ్లే ఉంటారు. అందుకు నేను చాలా రుణపడి ఉంటాను. నేను చాలా రోజులుగా మంచి పాత్రల కోసం వేచిచూస్తే సినిమాలు చేయలేదంటే అందుకు కారణం టాలీవుడ్ అందించిన ఆర్థిక ప్రోత్సాహమే.

ఇతర భాషలతో పోల్చితే టాలీవుడ్‌లో మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది?

ఇతర భాషలతో పోల్చితే టాలీవుడ్‌లో మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది?

టాలీవుడ్‌లో సినిమాలు చాలా వేగంగా పనిపూర్తి చేస్తారు. సినిమా ప్రారంభమైందే ఫినిష్ అయినట్టే భావించాలి. చకచకా టీజర్లు రిలీజ్ చేస్తారు. వేగంగా ఫస్ట్‌లుక్ విడుదలవుతుంది. ఆడియో కూడా వేగంగా వస్తుంది. ఇలాంటివి వేరే భాషల్లో కనిపించవు. మిగితా భాషల కంటే టాలీవుడ్‌లో ఫిలింమేకింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. టాలీవుడ్‌లో అందరూ మంచిగా బిహేవ్ చేస్తారు. మనుషుల్లో నిజాయితీ ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది.

క్యాస్టింగ్ కౌచ్ (పాత్రల కోసం పడకగదికి రమ్మనడం) సంఘటనలు ఎదుర్కొన్నారా?

క్యాస్టింగ్ కౌచ్ (పాత్రల కోసం పడకగదికి రమ్మనడం) సంఘటనలు ఎదుర్కొన్నారా?

కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. వేషాల కోసం పడకగదికి రమ్మని బలవంతం చేశారు. అవకాశాల కోసం నేను ఎప్పుడూ దిగజారలేదు. నేను ఒప్పుకోకపోవడంతో సినిమాల నుంచి నన్ను తొలగించారు. చాలాసార్లు అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. నా పాత్ర నిడివిని చాలా సందర్భాల్లో తగ్గించారు. సినిమాల్లో కనిపించకుండా చేశారు. ఇవన్నీ సినిమా పరిశ్రమలో సర్వ సాధారణం.

టాలీవుడ్ లో ఎదుర్కొన్నారా? బాలీవుడ్ లో ఎదుర్కొన్నారా?

టాలీవుడ్ లో ఎదుర్కొన్నారా? బాలీవుడ్ లో ఎదుర్కొన్నారా?

క్యాస్టింగ్ కౌచ్ అనేది.. ఏ ఒక్క సినిమా పరిశ్రమకూ పరిమితమైంది కాదు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో ఇది కనిపిస్తుంది. అన్ని పరిశ్రమల్లోనూ అవకాశం ఇస్తామని చెప్పి.. పడకగదికి రమ్మనేవాళ్లు చాలామంది ఉంటారు. నా కెరీర్ మొదట్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. హీరోయిన్ గా రాణించాలనుకునే ప్రతివారికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.

టాలీవుడ్ కు డ్రగ్స్ లింక్స్ పై మీ అభిప్రాయం?

టాలీవుడ్ కు డ్రగ్స్ లింక్స్ పై మీ అభిప్రాయం?

నేను గత మూడేళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్నాను. అసలేం జరుగుతోందో నాకు తెలియదు. నేను అలాంటివాటికి చాలా దూరంగా ఉంటాను. నాతో పని చేసిన వాళ్లకు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నట్టు నేను గుర్తించలేదు. ఈ మధ్య కాలంలో గరుడ వేగ కోసం చార్మినార్ వద్ద జరిగిన షూటింగ్ కు హాజరయ్యాను. అప్పుడు కూడా ఎవర్నీ కలవలేదు. టాలీవుడ్ డ్రగ్స్ లింకులపై నాకు పెద్దగా తెలియదు. ఈ విషయంపై నేను కామెంట్ చేయడం కూడా సరికాదు.

English summary
Shraddha Das, one of the talented artists in the film industry. She entered into tollywood with Siddu from Sikakulam. After that she acted in love story Arya 2, A. Karunakaran's Darling, Maro Charitra produced by Dil Raju. Sukumar's Arya 2 was her first high profile project. After ten years of career in different film industries, now she is working with Hindi, Bengali movies. The upcoming movie "Babumoshai Bandookbaaz" has become the most controversial movie at the censor board. In this occasion, Filmbeat Telugu has exclusively interviewed Shraddha Das about the projects and her journey in the film industry.
Please Wait while comments are loading...