చివరకు వేశ్యగా మారిన శ్రద్ధాదాస్!

By Bojja Kumar

హీరోయిన్ శ్రద్దాదాస్ హీరోయిన్‌గా రాణించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. పాపం కాలం కలిసి రావడం లేదు. దీంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు, ఇతర చిన్న పాత్రలు పోషిస్తూ అలా నెగ్గుకొస్తోంది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు కూడా చాలా తక్కువయ్యాయి. దీంతో వేశ్య పాత్రలు కూడా చేయడానికి సై అంటోంది. బాలీవుడ్ లో రూపొందుతున్న ఓ హిందీ చిత్రంలో వేశ్యగా నటించేందుకు శ్రద్ధ ఓకే చెప్పిందని తెలుస్తోంది. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా వద్ద అస్టెంట్‌గా పని చేసిన వ్యక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రద్ధాదాస్ మెగాస్టార్ మేనల్లుడు సాయిధర్ తేజ్ హీరోగా, వైవిఎస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మాత్రమే నటిస్తోంది. సినిమా అవకాశాల కోసం, నిర్మాతలు, దర్శకుల దృష్టిని ఆకర్షించడం కోసం హాట్ హాట్ గా బికినీలు వేసి మత్తెక్కించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తూ...పరిశ్రమలో నేను ఇంకా ఉన్నాను అంటూ గుర్తు చేస్తోంది.

తాను మరో పదేళ్ల వరకు పెళ్లి చేసుకోనని, తనకు ఎవరితోనూ పెళ్లి ఫిక్స్ కాలేదని, ఆ వార్తలను నమ్మ వద్దని చెబుతున్నఈ భామ....సినిమా రంగంలో రాణించడమే తన లక్ష్యం అంటోంది. మరి ఈ సారి వేశ్య పాత్రతోనైనా శ్రద్ధ సుడి తిరుగుతుందా....!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X