పదేళ్ల దాకా పెళ్లి చేసుకోనంటూ ట్వీట్
టాలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రద్దాదాస్ కి పెళ్లంటే ఎలర్జీ పట్టుకున్నట్లుంది. మరో పదేళ్ల దాకా పెళ్లి మాటత్తే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. ఆమె ట్విట్టర్ లో ఈ విషయం క్లారిపై ఇస్తూ ...నేను నా పెళ్ళి విషయంలో చాలా రూమర్స్ వింటున్నాను. అయ్యితే ఓ విషయం నేను క్లారిఫై చేస్తున్నాను. నేను నా కెరీర్ లో బిజిగా ఉన్నాను. మరో పదేళ్ల వరకూ నా పెళ్లి గొడవ ఎత్తద్దు. అప్పటివరకూ నేనూ పెళ్లే చేసుకోను. నేను ప్రస్తుతం నా వృత్తినే పెళ్లి చేసుకున్నా. దానికి న్యాయం చెయ్యనియ్యండి. నా కోరికలు,నా గోల్స్ అన్నీ ఒకదాని దాని తర్వాత మరొకటి తీర్చుకోనివ్వండి. ఆ తర్వాత పెళ్లి విషయం తీరిగ్గా ఆలోచిద్దాం అని ఘాటుగా చెప్తూ ట్వీట్ చేసింది ఇక తెలుగులో కేవవం సెకెండ్ హీరోయిన్స్ రోల్స్,అదీ హాట్ గా ఉండే క్యారెక్టర్సే కెరీర్ ప్రారంభం నుండీ పరిమితమైన ఆమె తనూ మెయిన్ హీరోయిన్ చేసే అవకాశం వస్తే నిరూపించుకుంటాను అంటోంది.
ప్రస్తుతం ఆమె వైవియస్ చౌదిరి దర్శకత్వంలో రూపొందుతున్న రేయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో చేస్తోంది. ఆ సినిమాలో ఆమె చాలా హాట్ గా కనపడనుందని ప్రచారం జరుగుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి మెయిన్ హీరోయిన్ కావాలనుకున్న తన కోరిక తీరకపోగా ఇప్పుడు వస్తున్న సెకండ్ హీరోయిన్ లాంటి వేషాలకు కూడా ముప్పువచ్చే పరిస్థితి ని ఆ మధ్య విడుదలైన 'ముగ్గురు'తెచ్చిపెట్టింది.మరో ప్రక్క వరుణ్ సందేశ్ హ్యాండ్ ఇవ్వటం కూడా ఆమెను బాధల్లో పడేసింది.తను నటించి సినిమాలు గురించి చెప్పాలంటే వరసగా ప్లాప్ సినిమాల లిస్ట్ చదివినట్లు అవుతోందని ఆమె వాపోతోంది. 'టార్గెట్' మొదలుకుని 'అధినేత' వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం', 'ఆర్య 2', వంటి చిత్రాలు మాత్రమే ఆమెకు గుర్తింపునిచ్చాయి కానీ ఆమెను మెయిన్ స్ట్రీమ్ లో నిలబెట్టలేకపోయాయి.


Click it and Unblock the Notifications











