'ఆర్య 2', 'నాగవల్లి' కలిసిరాలేదు ఆఖరికి ఆ సినిమా అయినా
శ్రధ్దాదాస్ కి మొదటినుంచీ కంటిన్యూగా ఆఫర్స్ వస్తున్నా ఎందుకనో కలిసిరావటం లేదు. ఆమె నటించిన 'అధినేత', 'ఆర్య-2', 'నాగవల్లి' వంటి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో ఆమె కెరీర్ ఇక్కడ అనుకున్నంత స్పీడుగా దూసుకుపోలేదు.దాంతో ఆమె ప్రస్తుతం బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయి అక్కడ ట్రై చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులోనూ ఆమె మధూర్ బండార్కర్ చిత్రం 'దిల్ తో బచ్చా హై జీ' చేసినప్పటినుంచి ఆ ఫీల్డుపై ఆసక్తి పెరిగిపోయింది. దాంతో అక్కడ దర్శకులు టాలెంట్ ని కనిపెట్టడంలో ముందుంటారు అని స్టేట్మెంట్స్ ఇస్తోంది. ఇక 'దిల్ తో బచ్చా హై జీ' లో అజయ్ దేవ్ గన్, ఇమ్రాన్ హష్మి, శ్రుతీ హాసన్ నటించారు. ఆ చిత్రంలో ఆమె ఓమి వైద్యకి జోడీగా గున్‌గున్ సర్కార్ అనే పాత్ర చేసింది. '3 ఇడియట్స్'లో చతుర్ రామలింగంగా ఓమి మంచి నవ్వులు పండించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 'దిల్ తో బచ్చా హై జీ' చిత్రం ఘనవిజయం సాధించి తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్థోందని ఆశపడుతోందామె.


Click it and Unblock the Notifications











