ఆమెను 'సీక్వెల్ క్వీన్' చేస్తున్నారని ఫీలవుతోంది
శ్రద్దాదాస్ ని అందరూ సీక్వెల్ క్వీన్ అనే పిలుస్తున్నారు. దానికి కారణం ఆమె ఆర్య సీక్వెల్ ఆర్య 2, మంత్ర సీక్వెల్ అంటూ వచ్చిన డైరీ చిత్రం, చంద్రముఖి సీక్వెల్, అలాగే కన్నడ ఆప్త రక్షకకి రీమేక్ అంటూ వచ్చిన నాగవల్లి, అలాగే మరోచరిత్ర రీమేక్ లలో ఒకరు వేసిన పాత్రలు ఈమె కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఈ విషయమై శ్రద్దా మాట్లాడుతూ ...నిజానికి నాకు ఈ ముద్ర వేయించుకోవటం ఇష్టం లేదు. కానీ నాకు వస్తున్న ఆఫర్స్ అన్నీ అలాంటివే కావటంతో నాకు తెలియకుండానే సీక్వెల్, రీమేక్ లలో చిక్కుకుపోయాను. ఎందుకనో దర్శక, నిర్మాతలకు అలాంటి పాత్రలనగానే నేనే గుర్తుకు వస్తున్నారు. అసలంటూ గుర్తుకు వస్తున్నందకు ఆనందించాలో ఇలాంటి పాత్రలు వస్తున్నందుకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. నాగవల్లిలో పాత్ర అనగానే..ఓ మైగాడ్..మళ్ళీనా అనుకున్నాడు. కానీ చేసాను. ఇలా చేసే వాటితో ఓ సమస్య ఉంది. మొదట వచ్చిన చిత్రంతో వాటిని పోల్చి చూస్తారు అని వాపోయింది.


Click it and Unblock the Notifications











