మరోసారి ప్రభాస్ గురించి శ్రద్ధాకపూర్, అతనిలో ఆ క్వాలిటి నచ్చింది!
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్.. ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ కథానాయకిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో వర్క్ చేయడం చాలా మంచి అనుభవమని పలు సందర్బాల్లో చెప్పిన శ్రద్దా తాజాగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ... ప్రభాస్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. ఒక స్టార్ హీరో అనే గర్వం ప్రభాస్‌లో కాకపోవడం గ్రేట్ అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

ప్రభాస్ ఎప్పుడూ అందరికి అందుబాటులోనే ఉంటారని, ఆయన్ను చేరుకోవడం చాలా సులభమని, ఈ క్వాలిటి ఆయనలో తనకు బాగా నచ్చిందని తెలిపింది శ్రద్దా కపూర్. ప్రభాస్ ఈ సినిమా తరువాత రాధాకృష్ణ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. గోపికృష్ణ మూవీస్ సంస్థలో కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నేల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది.


Click it and Unblock the Notifications











