ప్రభాస్ ‘సాహో’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

By Bojja Kumar

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ 'సాహో' అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత టీమ్ మొత్తం హైదరాబాద్ వచ్చేసిన సంగతి తెలిసిందే. అబుదాబి షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో 'సాహో' షెడ్యూల్ ప్లాన్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్ఎఫ్‌సిలో లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ప్రత్యేకంగా వేసిన మార్కెట్‌ సెట్‌‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌‌తో పాటు కీలక తారాగణంపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నలభై రోజులకు పైగా ఈ షెడ్యూల్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో కొన్ని యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

Shraddha Kapoor begins shooting for Sahoo

'సాహో' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ కానున్నాయి. 60 రోజుల అబుదాబిలో రూ. 90 కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని చిత్రీకరించారు. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సీన్ల కోసమే కేటాయించడం గమనార్హం.

యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2019లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X