మహేష్, ప్రభాస్‌ల గురించి శ్రద్దా కపూర్ ఏమన్నారో తెలుసా?: ఫ్యాన్స్ సంబరపడిపోతారు..
ఆషికి-2 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రద్దా కపూర్ కేవలం నటిగా మాత్రమే గాక సింగర్ గాను, గీత రచయిత గాను గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రభాస్ పక్కన సరైన జోడీ కోసం చాలామందిని సంప్రదించిన సాహో యూనిట్.. చివరకు శ్రద్దాను ఓకె చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రద్దా కపూర్.. అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

ప్రభాస్ గురించి:
ఆయన నిజంగానే 'డార్లింగ్.. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు అని చెప్పారు శ్రద్దా కపూర్. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు.

రజనీకాంత్ గురించి:
'ఆయన సింప్లిసిటీ అంటే ఇష్టం. స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని' రజనీకాంత్ గురించి చెప్పారు. ఇక అభిమానుల గురించి చెప్పాలని మరికొంతమంది నెటిజెన్స్ అడగ్గా.. 'వారు లేనిదే నేను లేను.. నా అభిమానులు ది బెస్ట్' అన్నారు.

మహేష్ బాబు గురించి:
ఓ అభిమాని మహేష్ బాబు గురించి శ్రద్దా కపూర్ అభిప్రాయం అడగ్గా.. 'ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్' అనేశారు. ఈ మాట దూకుడులో మహేష్ బాబు డైలాగ్‌ను గుర్తుచేస్తోంది.
మరో నెటిజెన్ ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ఏంటి అని అడగ్గా.. ఉప్మా, పోహా, పరాటా.. ఇంకా చాలా ఉన్నాయన్నారు. తన ఫేవరేట్ మీల్ బ్రేక్ ఫాస్టే అన్నారు.

షారుక్‌తో సినిమా ఎప్పుడు?:
ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు ఆయనతో చేయడానికి రెడీ. షారుక్ నాకు ఇష్టమైన హీరో అన్నారు శ్రద్దా. ఇక సేద తీరేందుకు ఎక్కువ ఏ ప్లేస్ ఇష్టపడుతారని అడగ్గా.. తన గదే తనకు మోస్ట్ ఫేవరెట్ అన్నారు.

కపూర్స్‌లో ఫేవరెట్?:
కపూర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు అన్న ఓ నెటిజెన్ ప్రశ్నకు.. 'రణ్ బీర్ కపూర్' అని బదులిచ్చారు శ్రద్దా. ఇక మీ ఫేవరెట్ రోల్ ఏంటి అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పడం కష్టమన్నారు. తాను చేసే ప్రతీ పాత్రను ఇష్టపడుతానని తెలిపారు.


Click it and Unblock the Notifications











