»   » అపీషియల్: ఎట్టకేలకు ప్రభాస్ ‘సాహో’ హీరోయిన్ ఖరారైంది

అపీషియల్: ఎట్టకేలకు ప్రభాస్ ‘సాహో’ హీరోయిన్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ ఏం సినిమా చేయడబోతున్నాడనే విషయంలో చాలా కాలం సస్పెన్స్ కొనసాగింది. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా ఖరారైన తర్వాత హీరోయిన్ విషయంలోనూ అదే తరహా సస్పెన్స్ సాగింది.

ప్రభాస్ సరసన ఎవరు హీరోయిన్ గా చేస్తున్నరనే విషయంలో కొంత కాలం అనుష్క పేరు, తర్వాత పలువురు ఇతర హీరోయిన్ల పేర్లూ వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి స్పష్టమైన ప్రకటన వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.


శ్రద్ధా కపూర్

బాలీవుడ్లో ‘ఆషికి 2' సినిమాతో బాగా పాపులర్ అయిన శ్రద్ధ కపూర్ ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరు. ‘సాహో' చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఆమె అయితేనే సినిమాకు యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.


వెనకాడని నిర్మాతలు

వెనకాడని నిర్మాతలు

శ్రద్ధా కపూర్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే డిమాండ్ చేసినా... ఆమె అయితేనే ప్రభాస్‌కు సరి జోడీగా ఉంటుందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా ఓకే చెప్పారు. యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ మాట్లాడుతూ... ‘శ్రద్ధా కపూర్ సాహో సినిమాలోని పాత్రకు బాగా సూటవుతుంది. మా సినిమాలో ఆమె చేస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని తెలిపారు.


Anushka item number in Mahesh's Bharath Ane Nenu After out of Saaho
ప్రభాస్ తొలి మూవీ

ప్రభాస్ తొలి మూవీ

సాహో చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా మూడు బాషల్లో తీస్తున్నారు కాబట్టే భారీగా ఖర్చు పెడుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కించే యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ అవుతాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.


ఫిల్మ్ సిటీలో భారీ సెట్

ఫిల్మ్ సిటీలో భారీ సెట్

సాహో చిత్రానికి సంబంధించి ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఈ సెట్లో చిత్రీకరింబోతున్నారు. ప్రభాస్ కెరీర్లోనే బాహుబలి తర్వాత ది బెస్ట్ యాక్షన్ సీన్లు ఉన్న చిత్రంగా ‘సాహో' మూవీ ఉండబోతోందని సమాచారం.


బాలీవుడ్ మార్కెటే లక్ష్యం

బాలీవుడ్ మార్కెటే లక్ష్యం

బాలీవుడ్ మార్కెట్ లక్ష్యంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎస్సాన్-లాయ్‌‌ లాంటి వారిని రంగంలోకి దించారు. అమితాబ్ భట్టాచర్యా హిందీలో లిరిక్స్ రాస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. 2018లో సాహో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


English summary
After numerous speculations around the leading lady of Saaho, the makers have announced their final choice. Makers have zeroed in on Shraddha Kapoor. The film is scheduled for release in 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu