»   » సాహో: ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన శ్రద్ధా కపూర్!

సాహో: ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన శ్రద్ధా కపూర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన శ్రద్ధా కపూర్! There Is No Fact In That News |

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'సాహో' అనే మరో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.... శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రద్ధా కపూర్ గురించి ఇటీవల రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె డ్యూయెల్ రోల్ చేస్తోందంటూ ప్రచారం మొదలైంది.

ఎలా పుట్టిందో తెలియదు

ఎలా పుట్టిందో తెలియదు

అసలు శ్రద్ధా కపూర్ మీద ఈ రూమర్ ఎలా పుట్టిందో తెలియదు కానీ.... ఆమె ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేస్తోందని... అందులో ఒకటి ఫియర్ లెస్ రోల్ అని, మరొకటి చాలా భయపడే రోల్ అంటూ వార్తలు వచ్చాయి.


క్లారిటీ ఇచ్చిన శ్రద్ధా కపూర్

క్లారిటీ ఇచ్చిన శ్రద్ధా కపూర్

‘సాహో' చిత్రంలో తాను డ్యూయెల్ రోల్ చేస్తున్నాననే రూమర్ల మీద ఎదురైన ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని, తాను డ్యూయెల్ రోల్ చేయడం లేదని తెలిపారు.


అద్భుతమైన పాత్ర

అద్భుతమైన పాత్ర

తాను ‘సాహో' ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని, నా కెరీర్లో చేస్తున్న తొలి మల్టీ లాంగ్వేజ్ మూవీ. ఈ చిత్రంలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని శ్రద్ధా కపూర్ తెలిపారు.


తెలుగు నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను

తెలుగు నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను

సినిమాలో సీన్లు తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. దీని వల్ల నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎంజాయ్ చేస్తూ తెలుగు నేర్చుకుంటున్నాను అని శ్రద్ధా కపూర్ తెలిపారు.


హైదరాబాద్‌లో షూటింగ్

హైదరాబాద్‌లో షూటింగ్

ప్రస్తుతం ‘సాహో' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడిస్తూ #Saaho Day 1 అంటూ పోస్టు చేశారు.English summary
The first look of Prabhas' Saaho was released a few months back and since then, a lot of speculations did the rounds about the film's leading lady. Until, the makers announced Shraddha Kapoor as Prabhas' heroine. There were reports about the actress essaying a double role in this slick action-thriller. However, here's the truth straight from the horse's mouth. When quizzed if she is indeed playing a dual role in Saaho, Shraddha cleared the role and said in a recent interview, "It is not a correct news and I'm not playing a double role in the film."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu