»   » ప్రభాస్ పేరు చెప్పగానే ఓవర్‌గా డిమాండ్ చేస్తున్నారు!

ప్రభాస్ పేరు చెప్పగానే ఓవర్‌గా డిమాండ్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇపుడు 'బాహుబలి స్టార్' అయిపోయాడు. రూ. 1000 కోట్ల, రూ. 1500 కోట్ల కలెక్షన్ మార్కును అందుకున్న తొలి ఇండియన్ హీరో. అంతే కాకుండా ప్రాంతీయ సినిమా హీరోనుండి జాతీయ స్థాయికి ఎదిగాడు.

ఇపుడు ప్రభాస్ తో సినిమా చేయాలంటే మినిమమ్ రూ. 100 కోట్ల పై చిలుకు బడ్జెట్ ఉండాల్సిందే. అందుకే బాహుబలి సినిమా తర్వాత ఆయన చేస్తున్న 'సాహో' చిత్రం రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఓవర్ గా డిమాండింగ్

ఓవర్ గా డిమాండింగ్

ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్, అదే స్థాయిలో సూపర్ కలెక్షన్లు ఉంటాయని ముందే ఊహిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి ఓవర్ గా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

8 కోట్లు అడిగిన శ్రద్ధా

8 కోట్లు అడిగిన శ్రద్ధా

‘సాహో' మూవీని తెలుగు, తమళంతో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని భావించిన చిత్ర బృందం శ్రద్ధ కపూర్ ను సంప్రదించారట. అయితే ప్రభాస్ తో చేయాలంటే రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేసిందట. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలకు కనీసం 4 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకోని శ్రద్ధ ఇంత డిమాండ్ చేయడం నిర్మాతలను ఆశ్చర్య పరిచింది.

లోఫర్ భామ కూడా..

లోఫర్ భామ కూడా..

తెలుగులో ‘లోఫర్' మూవీలో నటించిన దిశా పటాని కూడా ప్రభాస్ తో చేయడానికి రూ. 5 కోట్లు అడిగిందట. బాలీవుడ్లో పెద్దగా పాపులారిటీ కూడా లేని దిశా పటాని కూడా ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడంతో ఆమెను కూడా వద్దనుకున్నారట.

హీరోయిన్ ఎవరో?

హీరోయిన్ ఎవరో?

మరి ప్రభాస్ ‘సాహో' మూవీలో హీరోయిన్ ఎవరు? ప్రభాస్ కు పర్ఫెక్టుగా సూటయ్యే హీరోయిన్ ఎంపిక సౌత్ నుండి జరుగుతుందా? బాలీవుడ్ నుండి జరుగుతుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

English summary
It is known that the hunt for the leading lady of Prabhas' new film 'Saaho' is still on. Bollywood heroine Shraddha Kapoor reportedly quoted a whopping 8 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu