ప్రభాస్ పక్కనే ఏడాదిగా.. హీరోయిన్‌కి ఆ కోరిక ఇప్పటికి తీరిందట!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ నటిస్తుండడంతో హిందీలో ఈ చిత్రానికి ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది. గత ఏడాదిగా సాహో చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి తన కోరిక నెరవేరిందని శ్రద్దా కపూర్ చెబుతోంది. ఆ వివరాలు చూద్దాం..

రాజమౌళి అద్భుత సృష్టి
దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతి రూపమే బాహుబలి చిత్రం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసింది చిత్రం బాహుబలి. టెక్నీకల్ అంశాలపరంగా బాహుబలి చిత్రం ఇండియన్ చిత్రాలకు ఆదర్శంగా నిలిచింది. మాహిష్మతి రాజ్యాన్ని గ్రాఫిక్స్ లో అద్భుతంగా చూపించినా, అంతే అద్భుతమైన సెట్స్ కూడా నిర్మించారు. మహిస్మతి సెట్స్ ఇప్పటికి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. మహిస్మతి సెట్స్ ఇప్పుడు ఒక పర్యాటక ప్రాంతంలా మారిపోయింది.

ప్రభాస్ పక్కనే ఉంటూ
శ్రద్దా కపూర్ ప్రభాస్ పక్కనే ఉంటూ ఏడాది కాలంగా సాహో షూటింగ్ లో పాల్గొంటోంది. ఇప్పటివరకు చాలా షెడ్యూల్స్ రామోజీఫిల్మ్ సిటిలో జరిగాయి. కానీ ఇంతవరకు శ్రద్దా కపూర్ మాహిష్మతి సెట్స్ మాత్రం చూడలేదట. మాహిష్మతి రాజ్యం పక్కనే ఉన్నా చూడలేకపోవడానికి కారణం తీరిక లేకపోవడమే అంటోంది. ఎట్టకేలకు గ్యాప్ దొరకడంతో తాజాగా శ్రద్దా కపూర్ మాహిష్మతి సెట్స్ ని సందర్శించినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో మరికొద్ది రోజులు మాత్రమే షూటింగ్ ఉండడంతో శ్రద్దా కపూర్ మాహిష్మతి రాజ్యంలోకి ప్రవేశించి భారీ నిర్మాణాలని అస్వాధించింది.

సాహోలో ఎలాంటి పాత్ర
ఇక సాహో చిత్రంలో శ్రద్దా కపూర్ రోల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ అంతర్జాతీయ దొంగగా కనిపించబోతున్నాడని, శ్రద్దా కపూర్ అతడిని వేటాడే పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

ఏడాది కాలంగా
200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఏడాది కాలంగా సాహో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. నీల్ నితిన్ ముఖేష్, మందిర బేడీ, ఎవిలిన్ శర్మ, అరుణ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











