ప్రభాస్‌‌ని డార్లింగ్ అంటూ ముద్దుగా.. 10 రోజుల తర్వాత హీరోయిన్ రెస్పాన్స్!

Recommended Video

Prabhas Receives A Warm Welcome From Shraddha Kapoor || Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సినిమాల జోరు పెంచాడు. బాహుబలి చిత్రం కోసమే ప్రభాస్ దాదాపు 5 ఏళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదల కాకముందే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభమైంది. ఈ రెండూ భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రాలే. ఇటీవల ప్రభాస్ తొలి సారి సామజిక మాధ్యమం ఇంస్టాగ్రామ్ లోకి ప్రవేశించాడు. దీనితో సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ తాజాగా స్పందించింది.

లక్షల్లో ఫాలోవర్స్

లక్షల్లో ఫాలోవర్స్

ప్రభాస్ ఎంత స్టార్ అయినా మీడియాకు దూరంగా ఉంటాడు. హంగులు, ఆర్భాటాల గురించి పట్టించుకోడు. అందుకే ప్రభాస్ కు కొన్నిరోజుల క్రితం వరకు కూడా ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ప్రభాస్ సోషల్ మీడియాలోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి కోరిక ఫలించింది. ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే దాదాపు 7 లక్షల మంది ఫాలో అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ఖాతాకు 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

10 రోజుల తర్వాత

10 రోజుల తర్వాత

ప్రభాస్ సోషల్ మీడియాలోకి ప్రవేశించడంతో చాలా మంది సెలెబ్రిటీలు వెల్కమ్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలీవుడ్ బ్యూటీ, సాహో హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ ఎట్టకేలకు స్పందించింది. ఇంస్టాగ్రామ్ లోకి స్వాగతం ప్రభాస్.. నేను కలసిన గొప్ప వ్యక్తుల్లో నీవు కూడా ఒకడివి.. నీవు నిజంగా డార్లింగే అంటూ కామెంట్ పెట్టింది. నీల్ నితిన్ ముఖేష్ లాంటి సెలెబ్రిటీ కూడా ప్రభాస్ కు ఇంస్టాగ్రామ్లో స్వాగతం పలికాడు.

ముంబైలో షూటింగ్

ముంబైలో షూటింగ్

ప్రస్తుతం సాహో చిత్ర చివరి దశ షూటింగ్ జరుగుతోంది. సాహో చిత్ర టీజర్ ని ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా రిలీజ్ చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ముంబై సమీపంలో కర్జాత్ అనే ప్రాంతంలో సాహో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ తో పాటు ఇతర నటులు పాల్గొంటున్నారు. సాహో చిత్రం ఇండియన్ స్క్రీన్ పై ఇంతకుముందెన్నడూ చూడని యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతోంది.

ఆగష్టు 15న

ఆగష్టు 15న

సాహో చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్నాడు. ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అర్జున్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X