బాయ్‌ఫ్రెండ్‌తో టర్కీ వెళ్లిన ‘సాహో’ హీరోయిన్.. ప్రేమ ముదిరి పెళ్లి వైపు?
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'సాహో' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని ఇతర సినిమా ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయారు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్ట్రీట్ డాన్సర్ 3డి' దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత... మరో షూట్ కోసం టర్కీ బయల్దేరి వెళ్లింది. తన టర్కీ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలు శ్రద్దా కపూర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఒక దాంట్లో ఆమె బాయ్ ఫ్రెండుగా ప్రచారంలో ఉన్న రోహన్ శ్రేష్ఠ కూడా ఉండటం గమనార్హం. ఇందులో రోహన్ శ్రద్ధాను ఫోటోలు తీస్తూ కనిపించాడు.

ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందా?
శ్రద్ధా కపూర్, రోహన్ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరు తమ రిలేషన్ షిప్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని, 2020లో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ హల్ చల్ చేశాయి.

నా కూతురుకు పెళ్లి ఆలోచన లేదంటున్న శక్తి కపూర్
అయితే శ్రద్ధా కపూర్ పెళ్లి వార్తలను ఆమె తండ్రి శక్తి కపూర్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదు ‘బుల్ షిట్' అంటూ మండి పడ్డారు. మరో నాలుగైదేళ్ల వరకు శ్రద్ధా కపూర్ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని శక్తి కపూర్ స్పష్టం చేశారు. మరో రెండేళ్ల వరకు ఆమె కాల్షీట్లు కూడా ఖాళీ లేవనని గతంలో ఓ ఇంటర్వ్యూల స్పష్టం చేశారు.

ఆ కుర్రాడు నాకు తెలుసు, నా కూతురుపై నమ్మకం ఉంది
రోహన్‌తో శద్ధా కపూర్ ఎఫైర్ రూమర్లపై కూడా శక్తి కపూర్ కొన్ని రోజుల క్రితం రియాక్ట్ అయిన సంగత తెలిసిందే. నా కూతురు సినిమా రంగంలో ఉంది. ఇక్కడ ఇలాంటి వార్తలు కామన్. గతంలో ఆమెకు చాలా మందితో లింకప్ పెడుతూ న్యూస్ వేశారు. రోహన్ తండ్రి(ప్రముఖ బాలీవుడ్ ఫోటో గ్రాఫర్) నాకు మంచి స్నేహితుడు. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా... తన జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ నా కూతురు మాకు చెబుతుంది. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఆమె పెళ్లి చేసుకోదు అని స్పష్టం చేశారు.

శ్రద్ధా కపూర్
శ్రద్దా కపూర్ సినిమాల విషయానికొస్తే... ‘సాహో' మూవీలో ఆమెకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ప్రస్తుతం రెమో డిసౌజా దర్శకత్వంలో ‘స్ట్రీట్ డాన్సర్ 3డి' మూవీతో పాటు నితేష్ తివారి దర్శకత్వంలో ‘చిచ్చోరె' మూవీ చేస్తోంది.


Click it and Unblock the Notifications











