‘డ్రగ్ రాకెట్’‌లో శ్రద్దాకపూర్ పేరు! రియాతో ఫాంహౌజ్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ.. అలా గుట్టురట్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో‌ దృష్టికి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో రియాచక్రవర్తిని విచారించి జైలుకు పంపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులకు రియా చక్రవర్తి పలువురు పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్సీబీ మరికొన్ని పేర్లను బయటపెట్టినట్టు జాతీయ టెలివిజన్ ఛానెల్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

పాన్వెల్ ఫాంహౌజ్‌ పార్టీలో

పాన్వెల్ ఫాంహౌజ్‌ పార్టీలో

డ్రగ్స్ పార్టీలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పాన్వెల్ లేక్‌హౌజ్ ఫామ్‌హౌజ్ అడ్డగా మారిందనే విషయాన్ని ఇప్పటికే మేనేజర్ రజత్ మేవాలీ ధృవీకరించారు. తాజాగా పాన్వెల్ బోటు వర్కర్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ పార్టీలో శ్రద్దాకపూర్ కూడా పాల్గొన్నారనే విషయాన్నివెల్లడించారు.

సారా, శ్రద్దా, రియా జోరుగా పార్టీ

సారా, శ్రద్దా, రియా జోరుగా పార్టీ

మార్చి 28వ తేదీన చిచ్చోరే సినిమా సక్సెస్‌ను పురస్కరించుకొని పాన్వెల్ లేక్‌హౌజ్‌లో పార్టీ జరిగింది. ఆ పార్టీల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రియా చక్రవర్తి సంబరాలు జరుపుకొన్నారు. బోటులో లేక్‌లోకి వెళ్లి విహార యాత్ర చేసే వారు. ఆ సమయంలోనే ఆల్కాహాల్, మారిజువానా లాంటి డ్రగ్స్ తీసుకొనే వారు అని బోటు వర్కర్ వెల్లడించారు.

 భారీగా మద్యం, డ్రగ్స్ వినియోగం

భారీగా మద్యం, డ్రగ్స్ వినియోగం

మార్చి 28న జరిగిన పార్టీలో భారీగా మద్యం, డ్రగ్స్ ఉపయోగించారనే విషయం బయటకు వచ్చింది. ఇండియా టుడే చేసిన పరిశోధనలో పలు విషయాలు బయటపడ్డాయి. అదే రోజు సుశాంత్ అకౌంట్ నుంచి 40 వేల రూపాయలు విత్‌డ్రా చేశారనే ట్రాన్స్‌జాక్షన్‌ను బయటపెట్టింది. ఈ పార్టీలో పలువురు నటీనటులు పాల్గొన్నారనే విషయాన్ని ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి, దీపేశ్ సావంత్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
ఇప్పటికే రకుల్, డిజైనర్ సైమన్ పేర్లు

ఇప్పటికే రకుల్, డిజైనర్ సైమన్ పేర్లు


ఇప్పటికే ఎన్సీబీ దర్యాప్తులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమన్ ఖబట్టా లాంటి పేర్లు బయటకు వచ్చాయి. తమ విచారణలో రియా చక్రవర్తి ఈ పేర్లు వెల్లడించినట్టు అధికారులు స్పష్టం చేశారు. దాదాపు 25 మంది బాలీవుడ్ ప్రముఖులు పేర్లు రియా వెల్లడించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X