twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ సినిమా.. కుక్క పిల్ల కోసం భాదపడుతున్న హీరోయిన్!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ లో సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెలుగువారు మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    నగరాలన్నీ చుట్టేస్తూ

    నగరాలన్నీ చుట్టేస్తూ

    ప్రభాస్ సాహో చిత్రంలో ఛాన్స్ రావడం అదృష్టమే కానీ.. హీరోయిన్ శ్రద్దా కపూర్ మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శ్రద్దా కపూర్ కి ఇది టాలీవుడ్ లో తొలి చిత్రం. బాలీవుడ్ లో కూడా శ్రద్దా కపూర్ పలు చిత్రాల్లో నటిస్తుండడంతో నగరాలన్నీ చేట్టేయాల్సి వస్తోంది. తాజాగా సాహో కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. హైదరాబాద్ కు రాగానే రామోజీ ఫిలిం సిటీ దృశ్యాలని శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    కుక్క పిల్ల కోసం

    కుక్క పిల్ల కోసం

    సారా అలీఖాన్ తన పెంపుడు కుక్క శైలోహ్ ఫోటోని కూడా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసి.. దీనికి చాలా రోజుల పాటు దూరం కావాల్సి వస్తోంది అంటూ శ్రద్దా కపూర్ పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా సాహో చిత్రంలో శ్రద్దా కపూర్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రద్దా కపూర్ కు నార్త్ లో ఉన్న క్రేజ్ తో సాహో పై మరింతగా అంచనాలు పెరిగాయి.

    భారీ తారాగణం

    భారీ తారాగణం

    మందిర బేడీ, నీల్ నితిన్ ముఖేష్, ఎవిలిన్ శర్మ లాంటి ప్రముఖ నటులు సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రబస్ అంతర్జాతీయ వజ్రాల దొంగగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా వంటి ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.

    ఆగష్టు 15న

    ఆగష్టు 15న

    సాహో చిత్ర విడుదల తేదీని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది ఆగష్టు 15 న సాహో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియోకు దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి 2 విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ప్రభాస్ నుంచి మరో చిత్రం రాలేదు. సాహో విడుదల తేదీ ప్రకటించడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

    English summary
    Shraddha Kapoor jets off to Hyderabad for the next 'Saaho' schedule. The actress took to social media to share a few glimpses
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X