శ్రద్దా కపూర్‌కూ తప్పలేదు.., ప్రభాస్ పెళ్లి గురించి చెప్పమంటే ఏమందో తెలుసా?
Recommended Video

బాహుబలి-2 విడుదలకు ముందు 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అన్న ప్రశ్న ఎంతలా పాపులర్ అయిందో.. అంతే స్థాయిలో ప్రభాస్ పెళ్లెప్పుడూ? అన్న ప్రశ్న ఇప్పుడు అంతే పాపులర్ అవుతోంది. ప్రభాస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కో స్టార్స్.. ఇలా మీడియాకు ఎవరికి చిక్కినా సరే.. వాళ్లంతా ఈ ప్రశ్నను ఫేస్ చేయక తప్పని పరిస్థితి. 'సాహో'లో ప్రభాస్ సరసన నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్‌కు కూడా ఇప్పుడిదే ప్రశ్న ఎదురైంది..

ప్రభాస్ పెళ్లిపై శ్రద్దా?:
మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా.. ఓ జర్నలిస్ట్ 'ప్రభాస్ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా?..' అని హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ను ప్రశ్నించారు. నవ్వుతూ బదులిచ్చిన శ్రద్దా కపూర్.. 'నాకు తెలియదు.. ఈ ప్రశ్న ఏదో ప్రభాస్‌నే అడగండి' అని చెప్పేసింది.

అది ఇప్పుడు చెప్పలేను..:
ప్రభాస్ గురించి ప్రస్తావించడంతో.. 'ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి వ్యక్తి కూడా' అని కితాబిచ్చింది శ్రద్దా. ఇక సాహో సినిమా గురించి ఇప్పుడే తానేమి చెప్పలేనని.. ఆర్నెళ్ల తర్వాత మీరే చూస్తారని చెప్పింది.

సైనా నెహ్వాల్ బయోపిక్ పై..:
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లోనూ శ్రద్దాకపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల చాలా ప్రచారమే జరిగింది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు శ్రద్దా.
మ్యాచ్‌లు కచ్చితంగా ఆడతాను. కానీ ఎప్పుడన్నది చెప్పలేను'.. అని పరోక్షంగా సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోయినా.. సినిమా మాత్రం పక్కా అని చెప్పేశారన్నమాట.

తొలిసారి హారర్ సినిమాలో:
ప్రస్తుతం తాను 'స్త్రీ' చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటున్నట్లు శ్రద్దా తెలిపారు. చందేరిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోందని చెప్పారు. తన కెరీర్‌లో ఇదే తొలి హారర్ సినిమా అని చెప్పుకొచ్చారు.

పెదనాన్నకూ తెలియదు:
ఇక ప్రభాస్ పెళ్లి విషయానికొస్తే.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా చేతులెత్తిసినట్లే కనిపిస్తోంది. ప్రభాస్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక పెళ్లి గురించి తనకే తెలియాలి అన్నట్లుగా కృష్ణంరాజు కామెంట్ చేశారు. సో.. ప్రభాస్ పెళ్లెప్పుడూ? అంటూ ఎంతమందిని ప్రశ్నించినా దానికి సమాధానం రాబట్టడం ఇక కష్టమే. నేరుగా ప్రభాస్ చెబితే తప్ప దీనిపై క్లారిటీ రావడం కష్టం.


Click it and Unblock the Notifications











