»   » ప్రభాస్ షేర్ చేసినా ఎవరూ కనిపెట్టలేదు: ‘సాహో’లో శ్రద్ధా ఫస్ట్ లుక్ ఇదే!

ప్రభాస్ షేర్ చేసినా ఎవరూ కనిపెట్టలేదు: ‘సాహో’లో శ్రద్ధా ఫస్ట్ లుక్ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న 'సాహో' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫోటోలు బయటకు వచ్చాయే తప్ప.... శ్రద్ధా కపూర్ లుక్ ఇందులో ఎలా ఉండబోతోంది అనేది బయటకు రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి శ్రద్ధా కపూర్ లుక్ రిలీజైంది.

 సాహోలో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే

సాహోలో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే

‘సాహో' చిత్రంలో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్టు చేస్తూ..... సాహో చిత్రానికి సంబంధించి ఇదే శ్రద్దా కపూర్ ఫస్ట్ లుక్ అని వెల్లడించారు.


రెండు రోజుల క్రితమే ప్రభాస్

వాస్తవానికి రెండు రోజుల క్రితమే ప్రభాస్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఇదే ఫోటోను పోస్టు చేసి శ్రద్ధా కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ ఫోటో ‘సాహో' సెట్స్‌కు సంబంధించినది అని ఎవరూ కనిపెట్టలేక పోయారు.


 ‘సాహో'పై భారీ అంచనాలు

‘సాహో'పై భారీ అంచనాలు

సుజీత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. యూవి క్రియేషన్స్ పతాకంపై యూ ప్రమోద్, వి వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రూ. 40 కోట్లు కేవలం స్టంట్ సీక్వెన్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు.


గ్యాంగ్‌స్టర్ పాత్రలో మందిరా బేడీ

గ్యాంగ్‌స్టర్ పాత్రలో మందిరా బేడీ

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందిరా బేడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మందిరా బేడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.


 బాలీవుడ్ భారీ తారాగణం

బాలీవుడ్ భారీ తారాగణం

హిందీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రంలో హీరోయిన్‌‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో పాటు, విలన్‌గా నీల్ నితిన్ ముఖేష్, ముఖ్య పాత్రలో జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్‌ను తీసుకున్నారు. వీరితో పాటు అరుణ్ విజయ్, టిను ఆనంద్ నటిస్తున్నారు.


 అన్నీ విభాగాలు హైలెట్ అయ్యేలా

అన్నీ విభాగాలు హైలెట్ అయ్యేలా

ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా హైలెట్ అయ్యేలా బాలీవుడ్ త్రయం ‘శంకర్- ఎస్సాన్-లాయ్'‌కి కంపోజింగ్ బాధ్యతలు అప్పగించారు. సినిమాటోగ్రాఫర్‌గాఆర్ మధి, ఎడిటర్‌గా ఎ శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్లతో పాటు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ లాంటి వారితో ప్రతి విభాగం హైలెట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


 విదేశాల్లో షూటింగ్ సమస్యలు

విదేశాల్లో షూటింగ్ సమస్యలు

సాహో చిత్రానికి సంబంధించి హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ విదేశాల్లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లోని వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో షూటింగ్ జరుగాల్సి ఉండగా అక్కడ ఏర్పడిన కొన్న సమస్యల వల్ల సూటింగ్ పోస్టుపోన్డ్ అయింది.


English summary
Bollywood actress Shraddha Kapoor’s ‘Saaho’ first look released, which also stars Prabhas in the lead. Celebrity makeup artist Shraddha Naik shared a photo of the actor, reportedly from the sets of the film, on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu