మీటూ ఒక్కటే అనుకుంటే పొరపాటే.. లైంగిక వేధింపులపై శ్రద్ద శ్రీనాథ్ సెన్సేషనల్ కామెంట్స్
ఎన్ని విప్లవాలు వచ్చిన మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మాత్రం ఆగటం లేదు. సినీ ఇండస్ట్రీలో అయితే ఇవి మరీ ఎక్కువ. అయితే మహిళలపై జరుగుతున్న ఈ వేధింపులపై మీటు ఉద్యమం పేరిట కొందరు తారలు బయటకొచ్చి తమపై జరిగిన వేధింపుల గురించి బాహాటంగా చెప్పారు. అయితే తాజాగా శ్రద్ద శ్రీనాథ్ మీటూ ఉద్యమం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సరికొత్త విప్లవం రావాలంటోంది. మీటూ ఒక్కటే సరిపోదని ఆసక్తికరంగా స్పందించింది శ్రద్ద. ఇంతకీ ఆమె ఏమంది? వివరాల్లోకి పోతే..

జెర్సీ భామ శ్రద్ద శ్రీనాథ్
జెర్సీ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. గ్లామర్, రొమాన్స్, ఇంటి ఇల్లాలు ఇలా ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే రుజువు చేసింది శ్రద్ద.

కెరీర్ ప్రారంభంలో.. శ్రద్ద శ్రీనాథ్
తెలుగు తెరకు పరిచయం కాకముందే శ్రద్ద శ్రీనాథ్ తన సొంత భాష కన్నడలో యూ టర్న్, తమిళంలో విక్రమ్ వేద సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. తనకిచ్చిన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. శ్రద్ద ప్రధాన పాత్రలో కన్నడలో రూపొందిన యూ టర్న్ సినిమాను తెలుగులో సమంతను లీడ్ రోల్‌లో పెట్టి రీమేక్ చేశారు.

మీటూ ఒక్కటే అనుకుంటే పొరపాటే
ఇటీవల మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందించిన శ్రద్ద శ్రీనాథ్.. మీటూ లాంటి ఉద్యమం ఒక్కటే సెక్సువల్ హరాస్మెంట్ లను తగ్గించలేదని, ప్రతీ ఒక్క సెలబ్రిటీ నోరు విప్పితే గానీ, కీచకుల ఆట కట్టించలేమని పేర్కొంది. అప్పుడే సమాజంలో సరైన మార్పు వస్తుందని ఘాటుగా మాట్లాడింది శ్రద్ద శ్రీనాథ్.

మహిళా సేఫ్టీపై ఎడ్యుకేట్ కావాలి
మహిళా సేఫ్టీ, సెక్సువల్ హరాస్మెంట్ తదితర విషయాలపై ప్రతీ వ్యక్తి ప్రతీ రోజు ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉందని శ్రద్ద పేర్కొంది. మిమ్మల్ని టార్గెట్ చేసినా ఫర్వాలేదు ప్రతీ సందర్భంలో సెక్సువల్ హరాస్మెంట్ పట్ల నోరు విప్పాలని చెప్పింది శ్రద్ద శ్రీనాథ్.

బడా హీరోయిన్లతో.. భలే అదృష్టం
ఇక శ్రద్ద సినిమాలంటారా.. అతి త్వరలో సెట్స్ పైకి రానున్న కొరటాల, చిరు ప్రాజెక్టులో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. అయితే ఇందులో మొదటి హీరోయిన్‌గా అనుష్క లేదా నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రెండో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే బడా హీరోయిన్ల నడుమ మెగాస్టార్ చిరంజీవితో చిందులేసే అరుదైన అదృష్టం శ్రద్దా శ్రీనాథ్ సొంతమైనట్లే మరి.


Click it and Unblock the Notifications











