లైంగిక వేధింపులంటే నవ్వులాటయ్యింది.. తనకెదురైన అనుభవం అంటూ శ్రద్దా సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Shraddha Srinath Comments On Nirbhaya | తనకెదురైన అనుభవం అంటూ శ్రద్దా సెన్సేషనల్ కామెంట్స్

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఎన్ని విప్లవాలు వచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సమాజంలోని అన్ని ఇతర పరిశ్రమలతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ దుశ్చర్య రాజ్యమేలుతోంది. అందుకే ఈ విషయమై సరికొత్త విప్లవం రావాలని చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించింది శ్రద్దా శ్రీనాథ్. ఆ వివరాలు చూస్తే..

జెర్సీ భామ శ్రద్దా శ్రీనాథ్

జెర్సీ భామ శ్రద్దా శ్రీనాథ్

తెలుగులో ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ తెచ్చుకుంది. గ్లామర్, రొమాన్స్, ఇంటి ఇల్లాలు ఇలా ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే రుజువు చేసింది శ్రద్దా శ్రీనాథ్.

కెరీర్ ప్రారంభంలోనే క్రేజ్

కెరీర్ ప్రారంభంలోనే క్రేజ్

తెలుగు తెరకు పరిచయం కాకముందే శ్రద్ద శ్రీనాథ్ తన సొంత భాష కన్నడలో యూ టర్న్, తమిళంలో విక్రమ్ వేద సినిమాల్లో నటించింది. క్యారెక్టర్‌లో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది. దీంతో వరుస సౌత్‌లో అవకాశాలు పట్టేసిన ఈమె తాజాగా తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్' సినిమాలో నటించింది.

 ‘నేర్కొండ పార్వాయ్'.. శ్రద్దా రెస్పాన్స్

‘నేర్కొండ పార్వాయ్'.. శ్రద్దా రెస్పాన్స్

‘నేర్కొండ పార్వాయ్' సినిమాలో నటించిన పాత్రలో ఆమెపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో తనకు నిర్భయకు సంబంధించిన ఆలోచనలే మెదడులో మెదిలాయని తెలిపింది. ఏ అమ్మాయైనా తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పగానే.. ఎలా జరిగిందని ఆమెనే అడుగుతారే తప్ప నిందితులను ఏమీ అనరు. ప్రస్తుత సమాజంలో లైంగిక వేధింపులంటే నవ్వులాటయింది. ఆ మనోవేదనను కళ్ళకుగట్టినట్టు చూపించే సినిమానే ఇది అని శ్రద్దా పేర్కొంది.

తనకెదురైన ఓ అనుభవం గురించి

తనకెదురైన ఓ అనుభవం గురించి

సందర్భంగా తనకెదురైన ఓ అనుభవం గురించి చెప్పింది శ్రద్దా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ' ఘటన జరిగిన వారం రోజుల తర్వాత తన ఇంటర్న్‌షిప్‌ కోసమై ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, అప్పుడు మా అమ్మానాన్నలు భయపడ్డా కూడా తాను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పింది శ్రద్దా శ్రీనాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X