సినిమా కష్టం: పాపం శ్రద్దా కపూర్ ఇలా చెమటలు కక్కుతోంది

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ కోసం శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసిన విషయం విదితమే. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా 'సైనా' సినిమాని అభివర్ణిస్తోందామె.

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ కోసం శ్రద్ధా కపూర్‌ని ఎంపిక చేసిన విషయం విదితమే. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా 'సైనా' సినిమాని అభివర్ణిస్తోందామె. ఇప్పటికే, ఈ సినిమా కోసం ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టేసిందట శ్రద్ధా కపూర్‌. ముందు ముందు ఈ సినిమా కోసం సైనా నెహ్వాల్‌ దగ్గర కొన్ని సూచనలు, సలహాలు కూడా తీసుకుంటానని అంటోందామె.

ఎందుకింత ఆలస్యం

ఎందుకింత ఆలస్యం

ప్రకటించి ఇన్ని రోజులవుతున్నా అసలు ఆ సినిమా ప్రసక్తే బయట వినిపించటం లేదు. ఎందుకింత ఆలస్యం అంటే సైనా గా కనిపించనున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తరువాతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. గ్లామర్ రోల్స్‌తో పాటు విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు అంగీకరించింది.

Recommended Video

Filmibeat Top 10 ఫిల్మీ బీట్ టాప్ 10
 34 క్లాసులు కూడా పూర్తి

34 క్లాసులు కూడా పూర్తి

ఈ బయోపిక్‌లో నటించేందుకు ఆసక్తి చూపించిన శ్రద్ధా ఇందుకోసం బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి కూడా సిద్ధమైంది. ఇందుకోసం ముద్దుగుమ్మ కొంతకాలం నుంచి తన టైమ్ టేబుల్ కూడా మార్చుకుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజు ఉదయం ఆరు గంటలకే బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళుతున్న శ్రద్ధా ఇప్పటివరకు 34 క్లాసులను కూడా పూర్తిచేసుకుందట.

 బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్

బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ఆమెకు ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. బ్యాడ్మింటన్‌లో మెలకువల కోసం సైనాతోనూ అప్పుడప్పుడు మాట్లాడుతోందట శ్రద్ధా కపూర్. అయితే ఇంత చేస్తున్నా ఆమె ఇంకా బ్యాడ్మింటన్ నేర్చుకోవడంలో సక్సెస్ సాధించలేకపోతోందని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

శ్రద్ధా కపూర్ మరింత కష్టపడాల్సిందే

శ్రద్ధా కపూర్ మరింత కష్టపడాల్సిందే

షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే సైనా బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లాలట. మొదట్లో శ్రద్ధా ఉత్సాహం చూసిన దర్శకనిర్మాతలు ఆమె త్వరగానే బ్యాడ్మింటన్ నేర్చుకుంటుందని అనుకున్నారట. కానీ ఇప్పటికీ ఆమె ఈ గేమ్‌పై పట్టు సాధించకపోవడంతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మరికొంత సమయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. మొత్తానికి సైనా బయోపిక్ సెట్స్ పైకి వెళ్లాలంటే శ్రద్ధా కపూర్ మరింత కష్టపడాల్సిందే అని అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X