twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "సైన్యం" చిత్ర టీజర్ విడుదల: హీరోస్ నెవెర్ డై

    |

    గొట్టే ప్రొడక్షన్స్ పతాకంపై శ్రవణ్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం " సైన్యం" (హీరోస్ నెవెర్ డైస్). ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఎఫ్.డి.సి. ఛైర్మెన్ పి. రామ్ మోహన్ గారు ముఖ్యాతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

     హీరోస్ నెవెర్ డై

    హీరోస్ నెవెర్ డై

    ఎఫ్.డి.సి. ఛైర్మెన్ పి. రామ్ మోహన్ గారు మాట్లాడుతూ... చిత్ర టీజర్ బాగుంది. సైన్యం (హీరోస్ నెవెర్ డై) పేరులోనే దర్శకుడి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నటీనటులు కొత్తవారు అయినా చాలా బాగా చేసారు. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మార్కెటింగ్ బాగా చేసుకోవాలి.

    దర్శకులు గోపాలరావు

    దర్శకులు గోపాలరావు

    నిర్మాత, దర్శకులు గోపాలరావు మాట్లాడుతూ... టీజర్ చూసాక డైరెక్టర్ ప్రతిభ తెలిసింది. కొత్తవాళ్ళతో తీసిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఛైర్మెన్ గారు చిన్న బడ్జెట్ చిత్రాలకు సహకారం అందించాలి.

    ఫ్యామిలీ ఎమోషన్స్

    ఫ్యామిలీ ఎమోషన్స్

    చిత్ర దర్శకుడు శ్రవణ్ మాట్లాడుతూ... ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్ షిప్ బాక్డ్రాప్ గా సినిమా ఉంటుంది. విక్రాంత్ నటన ఆకట్టుకుంటే, వీజే భాను నటన కంటతడిపెట్టిస్తుంది. సినిమా ఎక్కువభాగం మా సొంత ఊరైన ఆముదాలపల్లి తీసాము. నా ఆలోచన ఒక సినిమాగా రావడానికి నాకు సహకరించిన అందరికి నా ధన్యవాదాలు.

    అందరం కష్టపడ్డాం

    అందరం కష్టపడ్డాం

    హీరో విక్రాంత్ మాట్లాడుతూ... అందరం కష్టపడ్డాం... సినిమా బాగావచ్చింది. ఈ సినిమా విడుదలై మాకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

    నా మొదటి సినిమాతో

    హీరో వీజే భాను మాట్లాడుతూ... చిన్నప్పటినుండి సినిమా హీరో అవ్వాలని గోల్ ఉండేది. గుర్తింపు ఉంటేతప్ప హీరోగా అవకాశంరాదని, 2010 లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, టీవీ షోస్ యాంకరింగ్ చేశాను.అలా గుర్తింపు తెచ్చుకొని, ఈరోజు హీరోగా నా మొదటి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రవణ్ కి, ఈ చిత్రానికి పనిచేసిన అందరికి ధన్యవాదాలు అని చెప్పారు.
    . విక్రాంత్, వీజే భాను, భాస్కర్, దేవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం వెంకటేష్ బొల్ల, కెమెరామెన్ ప్రవీణ్, ఎడిటర్ భాస్కర్, నిర్మాత & దర్శకుడు: జె.పి. శ్రవణ్ కుమార్.

    English summary
    The Movie Sainyam -heroes never die in Sharevan Kumar Direction Teaser out
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X