సలోని కట్టింగ్... మరో హీరోయిన్ ఓపెనింగ్!
హైదరాబాద్: చేతి నిండా సినిమాలు ఉన్న హీరోయిన్లు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రాచారం నిర్వహిస్తూ... భారీగా డబ్బులు గడిస్తుంటే, సినిమా అవకాశాలు లేని హీరోయిన్లు వస్త్ర దుకాణాల ఓపెనింగులకు, రిబ్బన్ కట్టింగు కార్యక్రమాలకు హాజరవుతూ మేము ఇంకా ఫీల్డ్ లోనే ఉన్నాం అంటూ.... జనం వారిని మరిచిపోకుండా ఉండేందుకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
మర్యాద రామన్న, తెలుగమ్మాయి చిత్రాల హీరోయిన్ సలోనికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు. హిందీలో ఓ చిత్రంలో మాత్రం నటిస్తోంది. తాజాగా ఈ భామ విశాఖలో శుక్రవారం జరిగిన ఓ వస్త్రదుకాణం ఓపెనింగు కార్యక్రమంలో పాల్గొంది. సలోని రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
మరో వైపు 'ఎన్ఆర్ఐ' మూవీ ఫేం శ్రావ్యారెడ్డి హైదరాబాద్ లోని కుషాయిగూడలో సందడి చేసింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇకత్ మేళాను శ్రావ్యారెడ్డి ప్రారంభించారు. ఇందులో ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈనెల 31 వరకు ఈ ప్రదర్శన సాగనుంది.


Click it and Unblock the Notifications












