మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించిన చిరు అల్లుడు శిరీష్ కి చుక్కెదురు...
తన భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం తనను వదిస్తున్నారని ప్రముఖ సినీనటుడు చిరు రెండో కుమార్తె శ్రీజ ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె భర్త శిరీష్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. మూడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్న మెగాస్టార్ చిరు చిన్న కూతురు శ్రీజ ఇటివల భర్తతో గొడవపడి విడాకులకు సిద్దం అవుతుంది. ఈ నేపద్యంలో తనను వేదిస్తున్నాడు అంటూ శిరీష్ ఫై శ్రీజ పలు కేసులు నమోదు చేసింది. వాటి ఆధారంగా పోలీసులు శిరీష్ ను విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కేసులను ఎదుర్కునేందుకు శిరీష్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిన తన భార్యతో ఓ ఐదు నిముషాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించాల్సిందిగా మనవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసాడు. వరకట్న వేధింపులు(498-ఏ) ఆ కేసు నాంపల్లి కోర్టులో నమోదైనందున తమ పరిదిలోకి రాదని మనవ హక్కుల కమిషన్ పిటిషన్ను తిరస్కరించింది. ఇదిలా ఉంటే అంతకు ముందు చిరంజీవి, ఆయన భార్య సురేఖను సిసిఎస్ పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











