»   » జయసుధ కొడుకు హీరోగా ‘బస్తీ’ (ట్రైలర్)

జయసుధ కొడుకు హీరోగా ‘బస్తీ’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి జయసుధ తన వారసుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. జయసుధ కొడుకు శ్రేయన్‌ కపూర్ నటిస్తున్న ‘బస్తీ' మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వజ్మన్ ప్రొడక్షన్స్ బేనర్లో తెరకెక్కుతున్నఈ సినిమా ట్రైలర్‌ను విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగింది.

ఈ చిత్రంలో శ్రేయాన్ సరసన ప్రగతి హీరోయిన్ గా నటిస్తోంది. వాసు మంతెన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసపల్లా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో జయసుద టీజర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదొక మంచి ప్రేమకథ. నా కొడుకు హీరోగా నటిస్తున్నాడు. శ్రేయాన్, ప్రగతి జోడీ క్యూట్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలి అని ఆకాంక్షించారు.


దర్వకుడు మాట్లాడుతూ...ఇదొక ప్రేమ కథా చిత్రం. హీరో హీరోయిన్ అనుకోకుండా అనుకోకుండా ప్రేమలో పడతారు. ఇంతలో హీరో సమస్యలో పడతాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఏం చేసాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. 36 రోజుల్లో సినిమా పూర్తి చేసాం. 42 గంటల్లో డబ్బింగ్ పూర్తయింది. కేసీఆర్ ముఖ్య అతిథిగా ఈ నెల 21న ఆడియో విడుదల చేస్తున్నాం అన్నారు.
హీరో శ్రేయాన్ మాట్లాడుతూ..నేను నేషనల్ లెవల్ స్పోర్ట్స్ మెడలిస్టును. క్రీడారంగంలో రాణించాలనుకున్న నాకు మొదట్లో సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. అమ్మకు కూడా నేను సినిమాల్లో నటించాలని లేదు. ఓసారి లగడపాటి శ్రీధర్ స్క్రిప్టు కూడా చెప్పారు. మూడేళ్ల క్రితం సినిమాల్లోకి రావాలనిపించింది. ముంబైలో ట్రయినింగ్ తీసుకున్నాను. మళ్లీ లగడపాటి శ్రీధర్ ను కలిసాను. ఆయన ఫ్రెండ్ వద్ద కథ ఉందని చెప్పారు. వినగానే బాగా నచ్చింది. ఈ సినిమాలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.


Shreayan Kapoor's debut film Basthi

ఈ చిత్రానికి మాటలు: ప్రభాకర్, ఎడిటింగ్: గౌతం రాజు, మ్యూజిక్: ప్రవీణ్ ఇమ్మడి, సినిమాటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: వాసు మంతెన.

English summary
Jayasudha's son Shreayan Kapoor's debut film Basthi first look launched at Dasapalla Hotel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu