twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'దేనికైనా రెడీ' సినిమా వివాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్త్రీలను కించ పరిచే విధంగా సన్ని వేశాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా స్త్రీరక్ష సమితి 'దేనికైనా రెడీ' సినిమాపై గళమెత్తింది.

    బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్త్రీరక్ష సమితి నేతలు మాట్లాడుతూ..... బ్రాహ్మణులను, మహిళలను కించ పరుస్తూ రూపొందించిన 'దేనికైనా రెడీ' చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.

    స్త్రీ రక్ష సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సుమలత శర్మ, ప్రధాన కార్యదర్శి నీలం దేవి తదితరులు మాట్లాడుతూ... మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు తీసే అన్ని సినిమాలను ఇకపై బహిష్కరిస్తామన్నారు.

    ఆ విషయం పక్కన పెడితే...
    దేనికైనా రెడీ, ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాల్లోని అభ్యంతరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు ఓకే చేసిన తర్వాత మళ్లీ కమిటీలు ఎందుకని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిటీపై మోహన్ బాబు కోర్టుకెక్కడంతో కోర్టు ఈ విధంగా స్పందించింది. మరో వైపు 'దేనికైనా రెడీ' సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని రఘునాథరావు అనే లాయర్ కోర్టుకెక్కారు. సినిమా మొత్తం ఒక కులం వారిని కించ పరిచే విధంగా ఉందని, సెన్సార్ బోర్డు సభ్యులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ ఇచ్చారని, అది పూర్తిగా అవకతవకలతో కూడిన సెన్సార్ సర్టిఫికెట్ అని రఘునాథరావు తన పిటీషన్లో పేర్కొన్నారు.

    English summary
    Shree Raksha Samithi state president Sumalatha Sharma demands arrest Producer and actor Mohan Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X