ఆ స్టార్ తల్లి అసిన్ ఫ్యానట!!!
సినిమా హీరోయిన్ల తల్లులు కూడా మామూలు మనుషులే కదా. వారికి కూడా స్వంత అభిప్రాయాలు ఉంటాయి. సొంత ఇష్టాలు ఉంటాయి. అలానే శ్రియా తల్లికి కూడా ఉన్నాయి. ఆమెకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. హీరోల సంగతి వదిలేస్తే శ్రియా తల్లికి నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా...శ్రియా మాత్రం కాదు..అదే విచిత్రం. శ్రియా తల్లికి నచ్చిన హీరోయిన్ అసిన్. అసిన్ నటించిన ప్రతి సినిమాను చూస్తుందట. గజిని సినిమాలో అసిన్ నటనను చూసిన తరువాత శ్రియా తల్లి ఆమె ఫ్యాన్ అయిపోయిందట.
శ్రియా మాటల్లోనే... అసిన్ చాలా మంచి నటి..ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం...మా అమ్మ అసిన్ కు పెద్ద ఫ్యాన్. అసిన్ తమిళంలో నటించిన గజిని, శివకాశి, పోక్కిరితో పాటు తెలుగులో నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు చూశాను...అమీర్ ఖానే స్వయంగా ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నాడంటేనే అసిన్ సత్తా ఏమిటో అర్థమవుతోంది...మేము మంచి ఫ్రెండ్స్ మి....పోటీదారులంకాము...అంది.
శ్రియాగారూ మరి త్రిషాతో స్నేహం ఏమైందని అడిగితే...మేము ఒకరిగురించి ఒకరం తెలుసుకుంటూనే ఉంటాం..మేమిద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ మి..మా మధ్య పోటీ ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు...అవన్నీ వట్టి పుకార్లు...త్రిషానే కాదు ఏ నటినీ నాకు పోటీదారుగా భావించను...అంటోందియ శ్రియా. ఎందుకో.


Click it and Unblock the Notifications











