శ్రియకు 'అంతర్జాతీయ' ఆహ్వానం
జీరో సైజ్ బ్యూటీ శ్రియకు అనుకోని ఆహ్వానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తోంది. సెప్టెంబరు 10 నుండీ ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక టొరంటో చలనచిత్రోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనమని శ్రియకు ఆహ్వానం అందింది. హిందీ చిత్రాలలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రియకు అంతర్జాతీయ వేదికైన ఈ చిత్రోత్సవంలో పాల్గొనడం ద్వారా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందట. ఈ కార్యక్రమంలో శ్రియతో పాటు ఫూలన్ దేవి పాత్రధారిని సీమా బిశ్వాస్ కూడా హాజరవుతోంది.
దీనికి తోడు శ్రియ నటించిన మల్లన్న చిత్రం స్పానిష్, ఇటాలియన్ వంటి విదేశీ భాషల్లో కూడా విడుదలవుతుండటంతో అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుందని కొండంత ఆశతో వుంది. చూద్దాం శ్రియ ఆశలు ఎంత వరకూ నెరవేరుతాయో...
shreya mallanna vikram pista vishal toranto film festival seema biswas శ్రియ మల్లన్న విక్రం విశాల్ పిస్తా సీమా బిశ్వాస్ టొరంటో చలనచిత్రోత్సవం


Click it and Unblock the Notifications