కునుకు లేకుండా చేస్తున్న శ్రియ
'ఇష్టం' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఢిల్లీ భామ శ్రియ. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డా శ్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. అటుపై టాలీవుడ్ లో ఐదేల్ల పాటు తన హవాను కొనసాగించిన శ్రియ స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. అందరినీ ఆశ్చర్యపరిచేలా తమిళంలో తన నాల్గవ చిత్రంతోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో శివాజీ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది. దీనికి శ్రియ గ్లామరే మొదటి కారణం అని చెప్పవచ్చు. తన మొదటి చిత్రం నుండీ ఇప్పటి వరకూ తన ఫిజిక్ ని అలాగే కాపాడుకొంటూ వస్తున్న శ్రియ పిస్తా చిత్రంతో జీరో సైజ్ పై కన్నేసింది. అసలే నాజూగ్గా కనిపించే శ్రియ, జీరో సైజ్ ఫిగర్ తో దక్షిణాది సినీపరిశ్రమలో పెనుతుఫానే రేపింది.
ఇదిలా వుంటే తన తాజా చిత్రం 'మల్లన్న'లో విక్రమ్ తో నటించిన శ్రియ చాలా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా 'లిప్ లాక్' సీన్లలో జీవించేసినట్టు సమాచారం. విక్రమ్ నటనతో పాటు శ్రియ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా వస్తున్న మల్లన్న చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులముందుకు రాబోతోంది. విడుదలకు ముందే ఇంతలా ఊరిస్తున్న శ్రియ గ్లామర్ విడుదల తర్వాత కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తుందనటంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











