శ్రియా హాలీవుడ్ అనుభవం
శ్రియా తన హాలీవుడ్ సంగతులను బుజ్జిబుజ్జిగా చెబుతోంది. తన హాలీవుడ్ సినిమా ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ సినిమా దాదాపు పూర్తికావచ్చిందని చెబుతోంది. ఈ సినిమాలో హీరో జెస్సీ మెట్కాఫ్ కాగా జిమ్మీ డాడ్సన్. శ్రియా మాటల్లో...సింగపూర్, న్యూఢిల్లీ, ముంబైలలో సినిమా మేజర్ పార్ట్ ను షూట్ చేశారు... ఇప్పటివరకు చాలా బాగా వచ్చింది...సహనటులు చాలా బాగా కోపరేట్ చేస్తున్నారు...నేను చక్కని నటనను ప్రదర్శించడానికి వారు నన్ను బాగా ప్రోత్సహించారు...మిగిలిన పార్ట్ షూటింగ్ న్యూయార్క్ లో చిత్రీకరించనున్నారు..జెస్సీ మెట్కాఫ్ ఫ్రెండ్లీగా ఉంటారు..ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను...అంది.
రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నారు. ఇండియన్ కాల్ సెంటర్ లో పని చేసే ఎంప్లాయ్ ఒక యువకునితే కలిసి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతుంది..ఫోన్ లో పరిచయమైన ఆ యువకుడితో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏం చేసిందన్నదే సినిమా కథ.
అక్టోబర్ లో ప్రారంభమైన ఈ సినిమాను భారత్ కు చెందిన యాడ్ లాబ్స్, అమెరికాకు చెందిన ఎమ్.జి.ఎమ్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ సినిమాను చేస్తున్నాయి. అశోక్ అమృత్ రాజ్, ప్యాట్రిక్ అయిల్లో లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











