ఐస్ బక్కెట్ ఛాలెంజ్: ఇప్పుడు హాట్ సింగర్ వంతు(వీడియో)

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/Y4k-1WOFncM" frameborder="0" allowfullscreen></iframe></center>
ఈ ఐస్ బక్కెట్ వీడియోల ఉద్దేశ్యం... ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఈ ఛాలెంజ్ బకెట్‌ను ప్రారంభించారు. అమియోట్రోపిక్ లేటరల్ స్లెరాసిస్ (ఏఎల్‌ఎస్) అనేది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి. ఈ వ్యాధి భారిన పడిన మనిషి జీవచ్ఛవంలా మారతాడు. పాశ్చాత్య దేశాల్లో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాకు చెందిన బేస్ బాల్ ప్లేయర్ పెటే ప్రేట్స్ దీని భారిన పడ్డారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు గత నెల ఐస్ వాటర్ నెత్తిన పోసుకొని ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. మీరూ ఇలా చేయగలరా అంటూ సవాల్ విసిరాడు. అంతే.. సవాల్‌ను స్వీకరించిన వాళ్లు ఐస్ బకెట్‌ని చేతపట్టుకుంటున్నారు.
ఇక శ్రేయా ఘోషల్ ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గాయని. ఇప్పటికే శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, కన్నడ, తమిళం, మలయాళం, అస్సామీ అని భాష తేడా లేకుండా అన్ని భాషల్లోనూ పాడి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తన ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











