నిజమే..వెతుక్కోవాల్సిన పరిస్థితి నాది: శ్రియ
ముంబై: "నటిగా అవకాశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కెరీర్ వెంగంగా ఉన్నప్పుడు వద్దన్నా మంచి పాత్రలు నా దగ్గరకు వచ్చేవి. ఇప్పుడు మంచి పాత్రల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే ఎక్కువ సినిమాలు చేయడం కంటే తక్కువ సినిమాలు చేసినా మంచి పాత్రలు చేయడం కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది శ్రియ. ముంబయ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా శ్రేయ పై విధంగా స్పందించారు.
ఆమె తాజాగా నటించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చెప్తూ... "ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ఓ మంచి పాత్ర చేశాను. అది నా కెరీర్ లో మరో గుర్తించుకునే పాత్ర. సినిమాకు నా పాత్ర కీలకం. శేఖర్ కమ్ముల సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. వాటిని ఈ సినిమా తప్పకుండా రీచ్ అవుతుంది" అని చెప్పింది.
"అలాగే ఓ పెద్దహీరో నటించనున్న మైథలాజికల్ మూవీలో కూడా భిన్నమైన పాత్ర చేయబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇంకా బాలీవుడ్‌లో రెండు సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇంకా తమిళం, కన్నడం, ఇంగ్లిష్ భాషల్లో కూడా నటిస్తున్నాను అని తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలిపింది శ్రీయ. ఇక హీరోయిన్ గా మునుపంత వేగంగా నా కెరీర్ లేని మాట నిజం. కానీ ఒక సెలబ్రిటీగా ఇప్పటికీ నేను బిజీగానే ఉన్నాను" అంది.
ఈ నెల 14న విడుదల అవుతున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' విషయానికి వస్తే... స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఓవర్‌సీస్‌లో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. నైజాం ప్రాంతానికి 'దిల్'రాజు విడుదల చేస్తున్నారు. సీడెడ్, కర్నాటక 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమాల్లోనే రికార్డు స్థాయిలో అమెరికాలో 55 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఇక విజయలక్ష్మీ ఫిలింస్ ద్వారా ఆంధ్రాలో విడుదల కానుంది. వారం ముందు నుంచే విడుదలయ్యే ప్రతి థియేటర్ వద్ద ఆడ్వాన్స్ బుకింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం డీటీఎస్ ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది


Click it and Unblock the Notifications











