డబ్బుకు శ్రియా దాసోహం కాదా?!?
మన కమెడియన్ల మాదిరిగానే తమిళ కమెడియన్ వడివేలు హీరోగా చాలా సినిమాలే చేస్తున్నాడు..హిట్లు కొడుతున్నాడు. శంకర్ నిర్మాణ సంస్థ తీసిన సినిమాలో నటించి సంచలనం సృష్టించాడు. తాజాగా వడివేలు నటిస్తున్న చిత్రం ఇందితలోగథిల్ న అజగప్పన్. ఈ సినిమాలో వడివేలు మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ప్రతి పాత్రకు హీరోయిన్ ఉంది.
దీనితో పాటు వడివేలు ఈ సినిమాలో ఊహల్లో తన డ్రీమ్ గర్ల్ తో విహరిస్తాడు. ఈ డ్రీమ్ గర్ల్ పాత్ర కోసం నిర్మాత శ్రియా ను సంప్రదించాడు. టాప్ హీరోయిన్ ను అయిన తను అలా ఐటమ్ సాంగ్ లో కనిపించేది లేదని మొండికేసింది. హీరోయిన్ గా ఒక సినిమాకు ఎంత తీసుకుంటావో అంతిస్తానని నిర్మాత ఆశ పెట్టడంతో శ్రియా మారు మాట్లాడకుండా సరేనంది. తిరునల్వేలీ సమీపంలోని కల్లిడకురిచిలో ఆ పాట చిత్రీకరణలో శ్రియా పాల్గొంటోంది. అందమైన ప్రకృతిలో వడివేలుతో వగలు పోతోంది. డబ్బుకు నటీనటులు దాసోహం కాదా మరి.


Click it and Unblock the Notifications











